Moviesబిగ్ బాస్ సీజన్ 5 లో పులిహోర రాజా ఆతడేగా..వామ్మో మామూలోడు...

బిగ్ బాస్ సీజన్ 5 లో పులిహోర రాజా ఆతడేగా..వామ్మో మామూలోడు కాదండోయ్..?

తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ‘టన్నుల కొద్దీ కిక్’ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల నడుమ ఈ షో సెప్టెంబర్ 05 సాయత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‏బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. నిన్నటి వరకు కంటెస్టెంట్లు ఎవరా అనే అనుమానాల ప్రచారం నుండి ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరో ఉత్కంఠ వీడి అందరినీ ఇంట్లోకి పంపేసి గొళ్ళెం పెట్టేశారు.

కాగా, మనకు తెలిసిందే ప్రతి ఏడాది హౌస్ లో ఒకరిద్దరు పులిహోర రాజాలు కనిపిస్తారు.పులిహోర రాజాలు అంటే ఎవరా..అని ఆలోచిస్తున్నారా..??అదేమి లేదండి..ప్రతి సంవత్సరం బిగ్ బాస్ హౌస్ లో లేడీ కంటెస్టెంట్లతో ముచ్చట్ల నుండి రాసుకుపూసుకు తిరుగుతూ.. వాళ్ళని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిచే వాళ్ళన్నమాట. ఇక గత సీజన్లో మనం చూసుకున్నట్లైతే.. అఖిల్-మోనాల్, పునర్నవి-రాహుల్ సిప్లిగంజ్.. ఇలా పులిహోర కలిపే హైలెట్ అయ్యారు.

మరి ఈ సీజన్ లో పులిహోర రాజా ఎవరు అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుండగా..అందరు వీజే సన్నీ అని అంటున్నారు.ఇప్పటికే ఆ పులిహోర యాపారం మొదలు పెట్టాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సన్నీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన అసలు పేరు అరుణ్ రెడ్డి.

చిన్నవయసులోనే అల్లాదీన్ అనే నాటకం వేసి ప్రశంసలు అందుకుని… ఆ తరువాత జస్ట్ ఫర్ మెన్ టీవీ షోతో యాంకర్‏గా పరిచయమై.. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్‏లో రిపోర్టర్‏గా చేశారు. ఆ తర్వాత వీజేగా ..ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news