MoviesCrazy Update:పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తో పవర్ స్టార్..డబుల్ జోష్​లో ఫ్యాన్స్..!!

Crazy Update:పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తో పవర్ స్టార్..డబుల్ జోష్​లో ఫ్యాన్స్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ “హరిహర వీరమల్లు”ను ప్రారంభించిన ..కొన్ని కారణాల చేత ఆగిపోయింది. దీంతో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్”ను మొదలు పెట్టేశాడు పవన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ “హరిహర వీరమల్లు”ను పూర్తి చేయబోతున్నారు.

అయితే నెడు పవన్ కళ్యాణ్ పుట్తినరోజు సంధర్భంగా ఆయన కు విషేస్ చెపుతూ..మేకర్స్ ఆయనకు సంబందించిన సినిమా విషయాలను రివీల్ చేస్తున్నారు. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్​స్టార్ పవన్​కల్యాణ్ మరో సినిమాకు అంగీకారం తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. పవన్ బర్త్ డే మరింత ప్రత్యేకం చేస్తూ.. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు తాజాగా యథా కాలమ్ తథా వ్యవహారమ్ అనే పదాలను రాసి ఉన్న పోస్టర్‌ను వదిలారు. ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకోబోతోన్నట్టు కనిపిస్తోంది. సురేందర్ సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, సైబర్ టవర్ ను చూపించడం ఆసక్తికరంగా ఉంది. ప్రీ లుక్ తోనే యాక్షన్ మూవీ అని చెప్పేశారు మేకర్స్. ఈ మూవీకి సురేందర్​ రెడ్డి దర్శకత్వం వహించబోతుండగా.. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. వక్కంతం వంశీ కథనందించారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news