Moviesకేక పెట్టిస్తున్న భీమ్లానాయక్.. సోషల్ మీడియాని ఊపు ఊపేస్తోన్న టైటిల్...

కేక పెట్టిస్తున్న భీమ్లానాయక్.. సోషల్ మీడియాని ఊపు ఊపేస్తోన్న టైటిల్ సాంగ్..!!

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. ​ఈ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ట్రెండింగ్ లో ఉంచేందుకు ట్రై చేస్తోంది.

ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా “భీమ్లా నాయక్” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎంట్రీ, యాక్షన్ ప్యాక్డ్ టీజర్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో వారు ఈ సాంగ్ గురించి కొన్ని రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం.

మాస్​ ప్రేక్షకుల్ని ఊపు ఊపేస్తోన్న ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఆయన లిరిక్స్​కు తమన్ మ్యూజిక్​ పెద్ద ప్లస్. “ఇరగదీసే ఇది ఫైరు సల్లగుండ, ఖాకీ డ్రెస్సు పక్కనెడితే ఈడే పెద్ద గూండా” వంటి పవర్​ఫుల్ లిరిక్స్​తో ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. “భీం భీం భీం భీం భీమ్లానాయక్… దంచి దడదడదడ లాడించే డ్యూటీ సేవక్…” అంటూ సాగుతున్న ఈ సాంగ్ అదిరిపోయిందని చెప్పాలి. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news