Moviesటక్కున నోరు జారిన ఆ సీరియల్ నటి..మగవాళ్ళు సీరియస్.. అసలు ఏమైందంటే..??

టక్కున నోరు జారిన ఆ సీరియల్ నటి..మగవాళ్ళు సీరియస్.. అసలు ఏమైందంటే..??

సుమ కనకాల..ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన వాక్చాతుర్యంతో ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ బుల్లితెర పై టాప్ యాంకర్గా కొనసాగుతూ వస్తుంది సుమ. ఈమెను యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఫీల్ అవుతుంటారు అంతా. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాల ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. సుమ వాక్చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే. మలయాళంకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. అలాగే స్పాంటేనియస్ గా పంచులు కూడా వేయగల సమర్ధురాలు. ఇక ఈమె ఈటీవిలో ఎప్పటినుంచో క్యాష్ అనే పోగ్రాం చేస్తుంది. బుల్లితెరపై “క్యాష్” ప్రోగ్రాం కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యాష్ షో ఎన్నో రోజుల నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.

ప్రతి వారం కూడా నలుగురు కొత్త గెస్ట్ లను ఇన్వైట్ చేసి వారితో పలురకాల రౌండ్స్ ఆడిస్తుంది సుమ. ఇక ఇటీవలే వచ్చే వారానికి సంబంధించి క్యాష్ ప్రోమో సోషల్ మీడియాలో విడుదలైంది. ఇఈ సారి క్యాష్ షో లో బుల్లితేరపై గుర్తింపు సంపాదించుకున్న జాకీ హరిత దంపతులతో పాటు ప్రీతినిగమ్ నగేష్ దంపతులు కూడా గెస్ట్లుగా వచ్చారు.

ఈ క్రమంలోనే ఓ వైపు ఒక అమ్మాయిని మరోవైపు ఒక అబ్బాయి నిలబెట్టి ఎవరు గొప్ప..మగవాళ్లా లేక ఆడవాళ్లా అని అడుగుతుంది సుమ. వెంటనే ఆ అమ్మాయి ..అమ్మయిలే ల గొప్ప ఎందుకంటే అమ్మాయిలు ఇంటిని మొత్తం మెయింటెన్ చేస్తారుగా అంటూ ఆన్సర్ ఇస్తుండగా ..

మధ్యలోకి ఎంటర్ అయ్యి ప్రీతినిగమ్ ఆడవాళ్ళు ఇంటిని మెయింటెన్ చేస్తారు.. మగవాళ్ళు ఆంటీ ని మైంటైన్ చేస్తారు అంటూ పంచ్ వేసింది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఆమె పై సీరియస్ ఆయ్యారు. ఒక్ యాక్టర్ అయ్యి ఉండి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news