Gossipsఫస్ట్ టైం ఆ బ్యూటితో రచ్చ చేయడానికి సిద్దమైన అల్లు అర్జున్..??

ఫస్ట్ టైం ఆ బ్యూటితో రచ్చ చేయడానికి సిద్దమైన అల్లు అర్జున్..??

వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి వేణు శ్రీరామ్ ఐకాన్ అనే టైటిల్ ఫిస్ చేసారు. దీనికి కనుబడుట లేదు అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అయినా కొన్ని అనివార్య కారణాలతో రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.దీంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కదేమో అని భావించారంతా.

కానీ ఇది ఓ స్టైలిష్ ఎంటర్ టైనర్ అని, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తామని వేణు శ్రీరామ్ హింట్ ఇవ్వడంతో మరోసారి అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇప్పటికే డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా తర్వాత ఐకాన్ సెట్స్ పైకి వెళ్లనున్నందట.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పక్కన ఇద్దరు భామలు నటించనున్నట్లు తెలుస్తుంది. ఢిపరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ సినిమాలో బుట్టబోమ్మ పూజాహెగ్డ్ ..అలాగే రౌడీ బేబీ సాయి పల్లవి నటించనున్నారంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే వారితో చర్చలు జరిగాయని, అందుకు ఇద్దరు భామలు ఓకే అనేశారని సమాచారం.

హీరోయిన్స్ విషయంలో మేకర్స్ తీసుకున్న ఈ డిసీజన్‌పై బన్నీ కూడా సంతృప్తిగా ఉన్నారట. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. దీని పై నెటిజన్స్ భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. కాంబినేషన్ బాగుంటుంది.. జోడి సూపర్ అంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు సాయి పల్లవి తో అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తే అదిరిపోద్ది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news