Moviesప్రభాస్‌ నుండి స్వీట్ సర్‌ప్రైజ్‌..అభిమానులకు ఢబుల్ పండగా..!!

ప్రభాస్‌ నుండి స్వీట్ సర్‌ప్రైజ్‌..అభిమానులకు ఢబుల్ పండగా..!!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ “రాధేశ్యామ్” సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. పీరియాడిక‌ల్ స్టోరీగా ల‌వ్ + యాక్ష‌న్ అంశాల‌తో తెర‌కెక్కే ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్‌తో పాటు ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ అయిన గోపీకృష్ణా మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం యూర‌ప్‌లో జ‌రిగిన ఓ య‌దార్థ ప్రేమ‌క‌థ‌కు కొన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలు జోడీంచి ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నాడ‌ని టాక్‌. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. రాధేశ్యామ్ నుండి వచ్చిన మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో ఇప్పటికీ రికార్డులను తిరగరాస్తుంది. ఇది ఒకవిధంగా ప్రభాస్ మేనియాకు అద్దంపట్టేదిగా చెప్పుకుంటున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇప్పటికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘రాధేశ్యామ్‌’ .. సినిమా అప్‌డేట్‌ కోసం ప్రభాస్‌ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు తాజాగా చిత్ర యూనిట్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తాజాగా కృష్ణాష్టమి స్పెషల్ ట్రీట్ ఇస్తూ ‘రాధే శ్యామ్’ నుంచి మరో సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ ఇద్దరి స్టిల్ రిలీజ్ చేస్తూ సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ప్రభాస్.. తన అభిమానులకు, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఫొటోలో ప్రభాస్‌ పూజాకు పియానో నేర్పిస్తున్నట్లు ఉంది. ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన చిత్ర యూనిట్‌.. ‘జన్మాష్టమి వేడుకలు జరుగుతోన్న నేపథ్యంలో.. విక్రమాదిత్య, ప్రేరణ నిజమైన ప్రేమకు అసలైన అర్థాన్ని చెబుతున్నారు’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తుండగా.. పూజాహెగ్డే ప్రేరణగా కనిపించనుంది. రాధేశ్యామ్‌ కొత్త పోస్టర్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్, పూజా హెగ్డేల లుక్ ఎంతో అట్రాక్ట్ చేస్తుండటంతో నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by UV Creations (@uvcreationsofficial)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news