Moviesవాట్ అమ్మ కాజల్ బేబీ..ఇంకేమి పనిలేదా..??

వాట్ అమ్మ కాజల్ బేబీ..ఇంకేమి పనిలేదా..??

టాలీవుడ్ చందమామ.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో నటనతో.. అదృష్టంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ కలువకళ్ల సుందరి. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దు గుమ్మ.. కాజల్ అగర్వాల్. తొలి సినిమా అంతగా హిట్‌ కానప్పటికీ. ఈ అమ్మడు ఆ తర్వాత నటించిన ‘చందమామ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు కాజల్.

చిరకాల మిత్రుడు, ప్రేమికుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చూసుకుంటున్నట్లు కాజల్ ప్రకటించి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇక ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇండస్ట్రీలో దుమ్ములేపుతుంది.

పెండ్లి పీట‌లెక్కిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు త‌ర‌చూ ఏదో ఒక అప్ డేట్‌తో ఫాలోవ‌ర్ల‌ను ప‌లుక‌రిస్తూనే ఉన్నారు. వెకేష‌న్ స్టిల్స్, స‌ర‌దా, రొమాంటిక్‌ క్ష‌ణాల‌ను అంద‌రితో పంచుకుంటున్నారు. అయితే ఈ ఇద్ద‌రు ఈ సారి మాత్రం చాలా సీరియ‌స్ గా ఉన్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

బ్లాక్ డ్రెస్ లో ఉన్న కాజ‌ల్ గాగుల్స్ పెట్టుకుని పుస్త‌కం చ‌దువుతుంటే..ప‌క్క‌నే కూర్చున్న గౌత‌మ్ ల్యాప్ టాప్ లో సీరియ‌స్ గా త‌న ప‌నిచేసుకుంటున్నాడు. కాజ‌ల్-గౌత‌మ్ ఇంట్లో ఉన్న‌పుడు రోజూ ఇలాగే ఉంటారేమో అని తాజా స్టిల్ చూసిన చాలా మంది అనుకుంటున్నారు. లేటెస్ట్ గా షేర్ చేసిన ఈ ఫోటోను చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫొటోను చూస్తుంటే వారు కొత్తగా పెళ్లి అయిన వారు ఉన్నట్లుగా లేరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తు జోక్ చేస్తున్నారు. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే ఇంతగా ఎవరి పనిలో వారు బిజీ అయితే ఎలా అంటూ మరి కొందరు ఫన్నీ జోక్స్ చేస్తున్నారు. వాట్ .. కాజల్ బేబీ.. ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావ్ అని ఒక్కరు అంటుంటే.. మరోక్కరు ఏమో..కొత్తగా పెళ్లి అయ్యిందిగా.. ఎంజాయి చేయ్యకుండా ఈ సీరియస్ డిస్టేన్స్ ఏంటి కాజల్ పాప అని కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news