Moviesవామ్మో..ఈ భామ ఒక్కొ ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందో తెలిస్తే.. కళ్లు...

వామ్మో..ఈ భామ ఒక్కొ ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుందో తెలిస్తే.. కళ్లు జిగేల్..?

స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి స్టోరి కంటెంట్ తో ప్రజల మనసును గెలుచుకుంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతూ, ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ లో నటీనటులు తమ నటనతో, అందంతో ప్రేకషకులను బాగా అలరిస్తూ..ఎంటర్ టన్ చేస్తున్నారు.

ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ రక్షా గౌడకి అభిమానులు మాములుగా లేరు..తన నటనతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈమె అసలు పేరు రక్షా గౌడ. బెంగుళూరులో జన్మించిన ఈమె..లోకల్ ఇంగ్లీషు గ్రామర్ హైస్కూల్ లో చదివిని అనంతరం జైన్ కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసింది.

స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రస్ట్ గల రక్షా.. తాను చూసిన సినిమాల్లో క్యారెక్టర్ ని ఊహించుకుంటూ ఇంట్లో అద్దం ముందు తానే హీరోయిన్ గా నటించేదట. అయితే ఇంటర్ చదువు తున్న సమయంలో కన్నడ సీరియల్స్ లో ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. రాధారమణ అనే తొలిసిరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది. అలా కన్నడంలో నటిస్తూ,కృష్ణవేణి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె అభిమాన నటుడు కెజిఎఫ్ హీరో యష్ అట.అలాగే అభిమాన హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ అంటే ఇష్టమట.

ఇక రక్షా బయట ఫుడ్ కన్నా కూడా ఇంట్లో తయారుచేసిన ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుందట. ఈమెకు న్యూజిలాండ్ అంటే బాగాఇష్టమైన ప్రదేశమట. ఇక ప్రస్తుతానికి నటిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఒక్కొక్క ఎపిసోడ్ కి ఈమె ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా.. అసలు నమ్మలేరండి..ఈ భామ ఒక్కొ ఎపిసోడ్ కి అక్షరాల 17వేలు తీసుకుంటుందట. ఇక ఈమె టోటల్ ఆస్తి మెత్తం అన్ని కోట్లు ఉంటుందో తెలుసా..నెట్ వర్త్ 3కోట్లు పైమాటే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news