MoviesNTR రిజెక్ట్ చేసిన సినిమా.. చరణ్ ఓకే చేసిన సినిమా ఇదే..!!

NTR రిజెక్ట్ చేసిన సినిమా.. చరణ్ ఓకే చేసిన సినిమా ఇదే..!!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేం. సినిమా పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. డేట్లు కుదరక కొన్ని, కథ నచ్చక కొన్ని…..ఇలా కొంతమంది హీరోలు వదులుకున్న సినిమాలు వేరే హీరోల చేతల్లోకి వెళ్లి బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయి.! ఇలా తెలుగులో కూడా అనేక సినిమాలున్నాయి. కొంతమంది దర్శకులైతే కథ రాసేటప్పుడే ఫలానా హీరో అని ఫిక్స్ అయిపోతారు…కానీ ఆ హీరో నో అని చెప్పేసరికే వేరే వాళ్లతో లాగించే ప్రయత్నం చేస్తారు. అలా తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీస్ ను వదులుకున్న హీరోస్ చాలామంది ఉన్నారు.

పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం పోకిరి సినిమాలు రవితేజ మహేష్ బాబు చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. అదే కోవలోకి రామ్ చరణ్ అల్లు అర్జున్ నటించిన ఎవడు సినిమా కూడా వస్తుంది ఎందుకంటే ఈ సినిమా కథను మొదటగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లకు చెప్పగా వారికి కథ నచ్చకపోవడం అలాగే వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఎవడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘానా విజయం సాధించి రామ్ చరణ్ కి మంచి బ్రేక్ ని ఇచ్చింది,ఈ సినిమా స్టోరీ కథ రచయితా వక్కంతం వంశి తొలుత ఎన్టీఆర్ కోసమే రాసుకున్నాడు అట, కానీ ఎందుకో ఈ సినిమా స్టోరీ ఎన్టీఆర్ కి నచ్చలేదు , ఇక రామ్ చరణ్ కి ఇదే కథని వినిపించగా ఆయనకి ఈ స్టోరీ బాగా నచ్చింది, వెంటనే డేట్స్ ఇచ్చేసి ఈ సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు రామ్ చరణ్. ఈ సినిమాను దిల్ రాజు 35 కోట్లతో నిర్మిస్తే 60 కోట్ల వరకు వసూలు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news