Moviesపెంపుడు కుక్క కి అవమానం..షూటింగ్ నుండి వెళ్ళిపోయిన స్టార్ హీరోయిన్..!!

పెంపుడు కుక్క కి అవమానం..షూటింగ్ నుండి వెళ్ళిపోయిన స్టార్ హీరోయిన్..!!

తమిళనాడు ముఖ్యమంత్రిగా కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జయలలిత సినిమా రంగానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆసుపత్రికే పరిమితమైన జయలలిత మరణించి 4ఏళ్ల పైనే అయ్యింది. కుటుంబ పరిస్థితుల వల్ల తల్లి బలవంతంతో తన 15వ యేట జయలలిత సినిమా రంగములోకి ప్రవేశించారు.

జయలలిత తొలి సినిమా ‘చిన్నడ గొంబె’ అనే కన్నడ చిత్రం. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్. జయలలిత తొలి తెలుగు సినిమా ‘మనుషులు మమతలు’. ఈ సినిమా తర్వాత జయలలిత స్టార్ హీరోయిన్ అయ్యారు. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ టైంలో జయ లలిత ఓ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక.. గూడచారి116 సినిమా కోసం నిర్మాత డూండీ అప్పుడే తేనె మనుసులు చిత్రంలో హీరోగా నటిస్తున్న కృష్ణ ను కలవడం జరిగింది. జేమ్స్ బాండ్ తరహా కథ తీస్తున్నామని అందులో నువ్వు హీరో వేషం వేయాలని హీరో కృష్ణకు వెయ్యి రూపాయలు అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంటు పేపర్ పై డూండి సైన్ చేయించుకోవడం జరిగింది. హీరోయిన్ గా తమిళంలో అప్పటికే ఒక విజయవంతమైన సినిమాలో నటించిన జయలలితను గూడచారి 116 సినిమాకి హీరోయిన్ గా ఎన్నుకున్నారు.

చాలా మందికి తమ పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎంత ఇష్టం ఉంటుంది అంటే, వాళ్ళ పెంపుడు జంతువుని వాళ్ళ సొంత మనిషి లాగా చూసుకుంటారు. కొంత మందికి ఇది వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ, ఇది నిజం. జంతువులు మనతో మనం మాట్లాడే భాషలో మాట్లాడలేవు. కానీ మనం చెప్పేది మాత్రం బాగా అర్థం చేసుకుంటాయి.

అయితే జయలలిత గారికి కుక్కలు అంటే చాలా ఇష్టం. వాటిని ఎంతో ప్రేమగా చూసుకునే జయలలిత గారు, షూటింగ్ సెట్స్ కూడా తీసుకెళ్ళేవారు. అలా గూడచారి 116 సినిమా షూటింగ్ కి కూడా తన పెంపుడు కుక్కని తీసుకెళ్లారు జయలలిత గారు. గూడచారి 116 సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ జయలలిత పెంపుడు కుక్క కి అవమానం జరిగిందట. అది భరించలేని జయలలిత షూటింగ్ నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందట.

ఇక విషయం తెలుకున్న దర్శకుడు అసలు ఏం జరిగిందని ఆరా తీయ్యగా.. విషయం తెలియడంతో దర్శకుడు మల్లికార్జునరావు, డూండీలు స్పందించి నిర్మాతలు అంటే విలువ లేకుండా ఇలా చేయడం ఏంటని..షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం మంచి పద్దతి కాదని కోపడ్డారట. కృష్ణ తో జయలలితకు మిగిలున్న షాట్స్ ని, కొన్ని క్లోజప్ సీన్స్ ని ముందుగానే తీసుకొని జయలలిత ఇచ్చిన కాల్షీట్స్ కంటే ముందే ఆమెను షూటింగ్ నుండి పంపించేసారట. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడచారి 116 సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news