Moviesతారకరత్నని ఇంట్లో నుంచి ఎందుకు గెంటేశారో తెలుసా..??

తారకరత్నని ఇంట్లో నుంచి ఎందుకు గెంటేశారో తెలుసా..??

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్యకు ఎనిమిది మంది సంతానం. ఇక ఎన్టీఆర్ వారసులు మొత్తం ఇండస్ట్రీలో సంబంధం ఉన్నవారే. కొంత మంది హీరోలుగా పరిచయం అయితే మరికొంత మంది దర్శకులుగా, నిర్మాతలుగా పరిచయమైయ్యారు.

ఇక ఎన్టీఆర్ ఐదో కొడుకు మోహన్ కృష్ణ. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తినే. ఆయన ఫోటోగ్రాఫర్ గా, ప్రొడ్యూసర్ గా రాణించారు. ఇక ఎన్టీఆర్ సినిమాలకు, తన సోదరుడు బాలకృష్ణ సినిమాలకు పని చేశారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ తనదైన శైలిలో క్రేజ్ అందుకోగా జూనియర్ ఎన్టీఆర్ మరో లెవెల్లో తన స్థాయిని పెంచుకుంటున్నాడు.

ఇక కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో డిఫరెంట్ కథలతో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కానీ మరో హీరో తారకరత్న మాత్రం ఇంకా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవడం లేదు.

నందమూరి నట వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తారకరత్న మొదటి సినిమా రిలీజ్ కాకముందే వరుసగా ఏడు సినిమాలను ఒకే చేసినట్లు అప్పట్లో గాసిప్స్ చాలానే వచ్చాయి. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేశాడు.

చేసిన సినిమాల్లో ఏ ఒక్కటి పెద్దగా క్లిక్ కాలేదు. దాంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు సాధించాడు.

అయితే తారకరత్న ఓ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక్క అమ్మాయిని ఇష్టపడ్డాట. ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి అయిపోయిందట.. ఇంట్లో వాళ్లకి విషయం చెప్పాడు.

కానీ ఎవరు ఒప్పుకోలేదు.. దీనికి ఇంట్లో వాళ్ళు అంగీకరించక పోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మరీ పెళ్ళిచేసుకుని వేరుగా ఉంటున్నాడు. అంతేకాదు.. తారకరత్న అప్పటి నుండి నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఇక తారకరత్నకి ఒక కొడుకు ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news