అందుకు కంగ‌నానే కరెక్ట్..ది బెస్ట్ అంతే..!!

కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు మొహానే చెప్పడం ఆమె అలవాటు. హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకున్నారు. చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో స్టార్ హీరోలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకుంది. పాత్రకి అనుగుణంగా ఆమె చూపే నటనా కౌశల్యాన్ని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు.

ఆమె ఇప్పటికే మణికర్ణిక, తలైవి అంటూ పలు బయోపిక్‌ల్లో నటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో టైటిల్‌ రోల్‌ చేసిన కంగనా రనౌత్‌ వెంటనే ఇందిరాగాంధీ పాత్ర చేయనుండడం మరో విశేషం. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయేంద్రప్రసాద్.. బాలీవుడ్ లో సీత అనే సినిమాకు కథను అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. రామాయ‌నంలో సీత పాత్ర‌ను హైలెట్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం హీరోయిన్ ల‌ను వెతికే ప‌నిలో దర్శకనిర్మాతలు నిమగ్నమవగా..ఈ నేప‌థ్యంలో సీత పాత్ర కోసం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే బాగుంటుందని, ఆమె మాత్రమే ఆ పాత్రకు ప్రాణం పోయగలదని.. విజయేంద్రప్రసాద్ దర్శకనిర్మాతలకు సలహా ఇచ్చారట. అంతేకాదు విజ‌యేంద్ర ప్ర‌సాద్ “త‌లైవి” సినిమాలోనూ జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టించేందుకు కంగ‌నాను తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడికి స‌లహా ఇచ్చిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం కంగనా రనౌత్ ‘ధాకడ్‌’, ‘తేజస్‌’, ‘అపరాజిత అయోధ్య’ చిత్రాలు చేస్తున్నారు.