వావ్‌: మ‌న మంగ్లీ హీరోయిన్ అయ్యింది… హీరో ఎవ‌రో తెలుసా..!

తెలుగులో సినీ రంగంలోనే కాకుండా.. యూ ట్యూబ్ లోనూ, ఇటు బుల్లితెర మీద ఫోక్ సింగ‌ర్‌గా మంగ్లీ చేసిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. మంగ్లీ ఏ సాంగ్ పాడినా కూడా యూ ట్యూబ్‌లో మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌స్తుంటాయి. ఏ సాంగ్‌కు అయినా త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ వ్యూస్ రావ‌డంతో పాటు వ‌చ్చే పాపులార్టీ మామూలుగా ఉండ‌దు. ఇటు బుల్లితెర మీద మంగ్లీ పాల్గొన్న‌, చేసిన ప్రోగ్రామ్స్‌కు అయినా తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మంగ్లీ ఇప్పుడు వెండితెర మీద కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.

మంగ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆమె సిగ్న‌ల్స్ కూడా ఇచ్చేస్తోంది. మంగ్లీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మోడ్ర‌స్ దుస్తుల‌తో దుమ్ము లేపుతోంది. ఆమె కూడా కాస్త హాటీ దుస్తుల‌తో కుర్ర కారును క‌వ్విస్తోంది. మైక్ టీవీ కు ఆమె ఎన్నో సాంగ్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆ సంస్థ నిర్మించే సినిమాలో ఆమె సోహైల్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంద‌ట‌.

బిగ్బాస్ షోలో పాల్గోన్న సోహైల్ బ‌య‌ట బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఇప్పుడు మైక్ టీవీ సోహైల్ – మంగ్లీ క్రేజీ కాంబినేష‌న్లో ఓ పాపుల‌ర్ సినిమా ప్లాన్ చేసింద‌ట‌. అయితే ఈ సినిమా కోసమే ఆమె మోడ్ర‌న్ లుక్‌లోకి మారి అంద‌రికి షాక్ ఇస్తోంది. మంగ్లీ అంటేనే ట్రెడిష‌న‌ల్ లుక్‌కు మారుపేరు. అలాంటిది ఆమె ఇప్పుడు ఇంత మోడ్ర‌న్‌గా క‌నిపిస్తుండ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు.