మా ఎన్నిక‌ల్లో క‌ళ్యాణ్‌రామ్‌… క్లారిటీ వ‌చ్చేసింది..

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ( మా ) ఎన్నిక‌ల్లో చ‌తుర్ముఖ పోటీ నెల‌కొంది. ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు ముందుగా పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే సీనియ‌ర్ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్ తో పాటు హేమ కూడా పోటీలో ఉండ‌డంతో చ‌తుర్ముఖ పోటీ నెల‌కొంది. ఎవ‌రికి వారు ప్ర‌చారం కూడా ముమ్మ‌రం చేసే ప‌నిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే నంద‌మూరి హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కూడా మా ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్నట్టు ఈ రోజు ఉద‌యం నుంచి వార్త‌లు ఒక్క‌టే గుప్పుమ‌న్నాయి.

ఈ వార్త‌లు జోరందుకోవ‌డంతో మా ఎన్నిక‌ల్లో పంచ‌ముఖ పోటీ త‌ప్ప‌ద‌ని.. మెగా ఫ్యామిలీ వ‌ర్సెస్ నంద‌మూరి ఫ్యామిలీ మ‌ధ్య వార్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంద‌ని ఒక‌టే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ వార్త‌ల‌పై క‌ళ్యాణ్ రామ్ స్పందించారు. తాను మా ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డంలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పుకార్ల‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పిన క‌ళ్యాణ్ వీటికి వెంట‌నే చెక్ పెట్టేశారు.

ఇక ఇప్ప‌టికే మా వార్‌లో లోక‌ల్ మంచు విష్ణు.. బెంగ‌ళూరులో ఉండే నాన్ లోక‌ల్ ప్ర‌కాష్ అంటూ యుద్ధం నడుస్తోంది. ఇక ఈ యుద్ధంలోకి ఇద్ద‌రు మ‌హిళా మ‌ణులు జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ ఎంట్రీతో ఎన్నిక‌లు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.