Moviesతొలిప్రేమ‌ డైరెక్ట‌ర్ ఒక‌ప్పుడు టాలీవుడ్‌ హీరో... మీకు తెలుసా..!

తొలిప్రేమ‌ డైరెక్ట‌ర్ ఒక‌ప్పుడు టాలీవుడ్‌ హీరో… మీకు తెలుసా..!

వెంకీ అట్లూరి ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న క్రేజీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రు. వ‌రుణ్ తేజ్‌తో తొలిప్రేమ లాంటి సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఆ త‌ర్వాత అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ హీరోగా తెర‌కెక్కిన మిస్ట‌ర్ మ‌జ్నును రూపొందించాడు. తొలి ప్రేమ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయినా మిస్ట‌ర్ మ‌జ్ను మాత్రం అంచ‌నాలు అందుకోలేదు. ఈ క్ర‌మంలోనే వెంకీ ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ సినిమాకు సంబంధించిన సినిమా ప‌నులు చ‌క్క‌బెడుతున్నాడు.

Venky Atluri Pushed Back Movie with Varun Tej

నితిన్ హీరోగా తెర‌కెక్కే రంగ్ దే సినిమాను వెంకీ డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ ప‌క్క‌న కీర్తి సురేష్ హీరోయిన్‌. ఇటీవ‌లే ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. రంగ్ దే షూటింగ్ కూడా కంప్లీట్ అయినా లాక్‌డౌన్ వ‌ల్ల థియేట‌ర్ల మూత‌ప‌డ‌డంతో రిలీజ్ వాయిదా ప‌డింది. అయితే వెంకీ అట్లూరి డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం కావ‌డానికి ముందు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు.

Director Venky Atluri Becomes a Potential Risk to Mr. Majnu?

మ‌ధుర శ్రీథ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన స్నేహ‌గీతం సినిమాలో మ‌నోడు హీరోగా చేశాడు. ఈ స్నేహ‌గీతంలో సందీప్ కిష‌న్‌, కృష్ణ చైత‌న్య‌తో పాటు మ‌రో హీరోగా వెంకీ అట్లూరి న‌టించాడు. ఆ త‌ర్వాత సినిమాల్లో హీరోగా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేసి డైరెక్ట‌ర్ అవ్వ‌డంతో పాటు తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్టాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news