Moviesపూజా అంటే స‌మంత‌కు ఎంత లైటో... ఎన్ని సార్లు అడిగినా నో...

పూజా అంటే స‌మంత‌కు ఎంత లైటో… ఎన్ని సార్లు అడిగినా నో రిప్లే..

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు పూజా హెగ్డే, స‌మంత మ‌ధ్య కొద్ది రోజులుగా కోల్డ్‌వార్ న‌డుస్తోంద‌న్న ప్ర‌చారం అయితే ముమ్మ‌రంగా ఉంది. ముందుగా పూజా సోష‌ల్ మీడియాలో స‌మంత అంత అంద‌గ‌త్తె కాద‌ని పోస్టులు పెట్టారు. అయితే దీనిపై పూజా స్పందిస్తూ త‌న ఇన్‌స్టా గ్రామ్ అక్కౌంట్ హ్యాక్ అయ్యింద‌ని ఆ పోస్టులు ఎవ‌రో పెట్టార‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. దీనికి పూజ వివ‌ర‌ణ ఇచ్చినా కూడా అప్ప‌టి నుంచి స‌మంత వ‌ర్సెస్ పూజా ఫ్యాన్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదికగా ర‌చ్చ మాత్రం ఆగ‌డం లేదు.

ముఖ్యంగా స‌మంత‌కు సౌత్‌లో అన్ని భాష‌ల్లోనూ మంచి పాపులార్టీతో పాటు ఎక్కువ మంది అభిమానులు ఉండ‌డంతో ఆమె ఫ్యాన్స్‌ను పూజాను విపరీతంగా ట్రోల్ చేస్తూ వ‌స్తున్నారు. ఆ త‌ర్వాత పూజా ఫ్యాన్స్ కూడా స‌మంత‌ను ట్రోల్ చేశారు. ఆ టైంలో స‌మంత ఫ్యాన్స్ పూజా సారీ చెప్పాల‌ని పెద్ద ర‌చ్చే చేశారు. ఆ త‌ర్వాత పూజా కావాల‌నే ఇలా చేసిందంటూ సమంతా, చిన్మయి, నందినీ రెడ్డిలు చేసుకున్న కామెంట్స్ కూడా రచ్చ రేపాయి.

ఈ టైంలో పూజ‌కు వ‌స్తోన్న క్రేజీ ఆఫ‌ర్ల‌ను స‌మంత మానిప్యులేట్ చేస్తోంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే తాజా ప‌రిణామం మాత్రం వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ అలాగే ఉంద‌న్న సంకేతాలు పంపింది. నిన్న ట్విట్ట‌ర్‌లో స‌మంత ఆస్క్ మీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో చాలా మంది పూజా హెగ్డే గురించి ఎన్నిసార్లు అడిగినా ఆమె మాత్రం స్పందించ‌లేదు. అస‌లు అలాంటి ప్ర‌శ్నే త‌న‌కు రాన‌ట్టు స‌మంత లైట్ తీస్కొంది. అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ ఇచ్చిన స‌మంత పూజ విష‌యంలో మాత్రం సైలెంట్‌గా ఉండ‌డంతో వీరి మ‌ధ్య గ్యాప్ అలాగే ఉంద‌న్న టాక్ కంటిన్యూ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news