Moviesచీ చీ ఇంత చెత్త‌మూవీనా.. IMDB లో 1.1 రేటింగా..!

చీ చీ ఇంత చెత్త‌మూవీనా.. IMDB లో 1.1 రేటింగా..!

ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా ఐఎండీబీఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల రివ్యూలు, రేటింగుల ప‌రంగా ప్రామాణిక‌త ఉన్న రేటింగ్ సంస్థ‌. ఇక ఇలాంటి ప్రామాణిక‌త ఉన్న సంస్థ‌లో అత్యంత వ‌ర‌స్ట్ సినిమాగా నిలిచింది బాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ స‌డ‌క్ 2. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఈ సినిమాకు ఐఎండీబీ మ‌రీ దారుణంగా.. ఇంకా చెప్పాలంటే ఘోరాతీ ఘోరంగా కేవలం 1.1 రేటింగ్ మాత్ర‌మే ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సంస్థ ఇచ్చిన రేటింగ్‌లో అత్యంత చెత్త రేటింగ్ మూట‌క‌ట్టుకున్న సినిమాగా స‌డ‌క్ 2 నిలిచింది.

ఇంత‌కు ముందు చెత్త సినిమాగా కె.వో.జడ్ అనే 2015 టర్కిష్ చిత్రం 1.3 రేటింగ్ కలిగి ఉంది. ఇప్పుడు అంత‌కంటే ఘోరంగా స‌డ‌క్ 2 చెత్త రేటింగ్ తెచ్చుకుంది. అంటే 10 మార్కుల్లో వ‌చ్చింది కేవ‌లం 1 మార్క్ మాత్ర‌మే. ఆలియాభట్ ప్రధాన పాత్రలో మహేష్ భట్ రూపొందించిన ఈ సినిమాపై సుశాంత్ సింగ్ అభిమానులు తొలి నుంచి నెగెటివ్ ప్రచారమే చేస్తున్నారు.

ఇక యూట్యూబ్‌లో కూడా సుశాంత్ అభిమానులే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులు కూడా ఎక్కువ డిస్‌లైక్‌లు కొట్ట‌డంతో డిస్‌లైక్‌ల ప‌రంగా చెత్త రికార్డు వ‌ర‌ల్డ్ వైడ్ స్థాయిలో న‌మోదు అయ్యింది. ఇక జాతీయ మీడియా సైతం ఈ సినిమాను పెద్ద చెత్త సినిమాగా విమ‌ర్శించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావ‌డంతో అక్క‌డ వ్యూస్ ఎలా ఉంటాయో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news