Moviesస్కూల్ యూనీఫాంలో ప‌వ‌న్ అత్త చంపేస్తోందిగా..!

స్కూల్ యూనీఫాంలో ప‌వ‌న్ అత్త చంపేస్తోందిగా..!

ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో ఏదైనా బాగా వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే హీరోలు, హీరోయిన్లు కొంద‌రు పాత ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే స‌ర‌దాగా వీరు షేర్ చేస్తోన్న ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ అత్త న‌దియా స్టిల్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. న‌దియా 1980-1990 కాలంలో తెలుగు, త‌మిళంలో మంచి పాపుల‌ర్ హీరోయిన్‌. ఆమె తెలుగుతో పాటు త‌మిళ్‌లో ప‌లు హిట్ సినిమాల్లో న‌టించింది.

నదియా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. న‌దియా ఇన్‌స్ట్రాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో వైర‌ల్ అవుతోంది. న‌దియా 1986లో త‌మిళ్‌లో హీరో సురేష్‌తో క‌లిసి నటించిన పూకలై పరికత్రికల్ సినిమాలో ఈమె నటించింది. ఈ సినిమాలో న‌దియా స్కూల్ డ్రెస్సులో న‌దియా క‌నిపించింది. అప్ప‌టి లేడీ సైకిల్ వేసుకుని స్కూల్ యూనీఫాంలో న‌దియాను చూస్తుంటే వావ్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.

అప్ప‌ట‌కీ ఇప్ప‌ట‌కీ ఆమె మొహంలో ఏ మాత్రం మార్పులేద‌న్న‌ట్టుగా ఉంది. కాస్త ప‌ర్స‌నాలిటీలో మార్పు రావ‌డం త‌ప్పా న‌దియా అందం ఏ మాత్రం చెక్కు చెద‌ర్లేదు. ఏదేమైనా అప్ప‌ట‌కీ ఇప్ప‌ట‌కీ ప‌వ‌న్ అత్త సూప‌ర్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news