Gossipsకేజీఎఫ్ 2లో ప్ర‌కాశ్‌రాజ్ రోల్ ఇదే

కేజీఎఫ్ 2లో ప్ర‌కాశ్‌రాజ్ రోల్ ఇదే

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సెట్స్‌మీద ఉన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల‌లో కేజీఎఫ్ 2 ప్రాజెక్టు కూడా ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్ య‌శ్ హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా లాక్‌డౌన్ లేక‌పోయి ఉంటే ఈ పాటికే కేజీఎఫ్ 2 థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసేది. ఇక ఈ భారీ ప్రాజెక్టుపై లెక్క‌లేన‌న్ని అంచ‌నాలు ఉన్నాయి. వాస్త‌వంగా ఇప్పటికే టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని అనుకున్నా సాధ్యం కాలేదు. ఇక రెండు రోజుల క్రిత‌మే బెంగ‌ళూరులోని కంఠ‌రీవ స్టేడియంలో షూటింగ్ ప్రారంభ‌మైంది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైందో లేదో వెంట‌నే అంద‌రిలోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇక ఈ సినిమా నుంచి ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజా షూటింగ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మీదనే మొదలు కావడంతో ప్ర‌కాష్‌రాజ్ ఏ రోల్ చేస్తున్నాడా ? అని చ‌ర్చించుకుంటున్నారు. కేజీఎఫ్ 1లో కనిపించిన అనంత్ నాగ్ రోల్ ను ప్ర‌కాష్‌రాజ్ రీప్లేస్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి.

ఇక  ఈ పాత్ర‌కు సంబంధించి ఇప్పుడు మ‌రో క్లారిటీ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్ రోల్ పూర్తిగా కొత్త‌ది అని.. కేవ‌లం రెండో పార్ట్ రిలేటెడ్‌గా మాత్ర‌మే ఈ రోల్ ప‌రిచ‌యం అవుతుంద‌ని చెపుతున్నారు. ఏదేమైనా అనంత‌నాగ్ రోల్ విష‌యంలో మాత్రం ఇపుడు ఇది సస్పెన్స్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news