Moviesఆ హీరో అంటే ఇస్మార్ట్ భామ ప‌డిచ‌చ్చేదా... చెప్ప‌లేనంత ఇష్ట‌మా..!

ఆ హీరో అంటే ఇస్మార్ట్ భామ ప‌డిచ‌చ్చేదా… చెప్ప‌లేనంత ఇష్ట‌మా..!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు నాట మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నభా నటేష్. ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌భా అందాల ఆర‌బోత‌కు మ‌న తెలుగు కుర్ర‌కారు ఎంత ఫిదా అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరుతో పాటు మరిన్ని అవకాశాలను నభా తన ఖాతాలో వేసుకుంది. ఇస్మార్ట్ శంక‌ర్ సూప‌ర్ మాసివ్ హిట్ అయినా కూడా న‌భాకు ఇక్క‌డ పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావ‌డం లేదు. మీడియం రేంజ్ హీరోలు మాత్రం ఆమెతో న‌టించేందుకు రెడీగానే ఉన్నారు.

Nabha Natesh: I feel right at home in Tollywood: Nabha Natesh | Telugu Movie News - Times of India

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నభా.. గతంలో తను ఇష్టపడిన హీరో గురించి మాట్లాడింది. న‌భాకు చిన్న‌ప్ప‌టి నుంచి బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టం అట‌. న‌భా షారుక్ సినిమాలు క్ర‌మం త‌ప్ప‌కుండా చూసేద‌ట‌. చిన్న‌ప్ప‌టి నుంచే షారుక్ సినిమాలు చూస్తే ఆయ‌న‌పై విప‌రీత‌మైన అభిమానం పెంచుకున్నాన‌ని చెపుతోంది. షారుక్‌పై త‌న‌కు ఉన్న ఇష్టాన్ని మాట‌ల్లో చెప్ప‌లేన‌ని.. కుచ్‌ కుచ్‌ హోతా హై ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. కాలేజ్ రోజుల్లో షారూక్‌ను ఎంతగానో ప్రేమించాన‌ని న‌భా చెపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news