Moviesఅత‌డి వ‌ల్లే నేను డ్ర‌గ్స్ మ‌త్తులోకి దిగాను: క‌ంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌నం

అత‌డి వ‌ల్లే నేను డ్ర‌గ్స్ మ‌త్తులోకి దిగాను: క‌ంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌నం

సినిమా ఇండ‌స్ట్రీ అన్నాక ఇటీవ‌ల డ్ర‌గ్స్‌, లైంగీక వేధింపులు, ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌లు కామ‌న్ అయిపోయాయి. ఇక ఇటీవల ఏ వివాదం జ‌రిగినా అందులోకి బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌, క్వీన్ కంగ‌నా ర‌నౌత్ దూరిపోతుంది.. ఇది ఆమెకు అల‌వాటుగా మారింది. లైంగీక వేధింపుల చ‌ర్చ న‌డుస్తున్న‌ప్పుడు ఆమె తాను ఆ బాధితురాలినే అని చెప్పుకుంది. ఆ త‌ర్వాత మీ టూ అంటే మీ టూ అని తన‌కు తానే ప్ర‌క‌టించుకుంది. ఇక బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత ఇక్క‌డ పాతుకుపోయిన బంధుప్రీతిపై బ‌లంగా వాయిస్ వినిపించిన ఆమె ఇప్పుడు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ న‌డుస్తుండ‌గా తాను కూడా దీనికి బాధితురాలినే అని త‌న‌కు తానే ప్ర‌క‌టించుకుంటోంది.

Watch: Kangana Ranaut defends Rangoli Chandel, asks govt to 'demolish'  Twitter in India, Entertainment News | wionews.com

ఇలా ఏ వివాదం వ‌చ్చినా అందులో దూరిపోవ‌డం కంగ‌నాకు అల‌వాటుగా మారింది. తాను డ్ర‌గ్స్ బాధితురాలినే అని చెప్పుకున్న కంగ‌నా తాను డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని.. త‌న‌కు మైన‌ర్‌గా ఉన్న‌ప్పుడే త‌న మెంట‌ర్ త‌న‌కు తెలియ‌కుండానే డ్ర‌గ్స్ అల‌వాటు చేయ‌డంతో తాను డ్ర‌గ్స్ బాధితురాలిగా మారిపోయాన‌ని చెప్పుకొచ్చింది. స‌రే కంగనా డ్ర‌గ్స్ బాధితురాలా ? కాదా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ఏ వివాదంలో అయినా ఆమె దూరేసి దానిని మ‌రింత ర‌చ్చ చేయ‌డం ఇటీవ‌ల కాలంలో ఆమెకు అల‌వాటుగా మారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news