Moviesబ్రేకింగ్ : షూటింగ్ లో నానికి ప్రమాదం..?

బ్రేకింగ్ : షూటింగ్ లో నానికి ప్రమాదం..?

ఈ మద్య సినిమా హీరోలు చాలా నేచురల్ గా ఏ సీన్ అయినా పండాలని చూస్తున్నారు. దాని వల్ల వెండి తెరపై చూస్తున్న ప్రేక్షకుల ఓ మంచి అనుభూతి పొందుతారని వారి అభిప్రాయం. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని సాధ్యమైనంత వరకు ఏ సీన్ అయినా చాలా నేచురల్ గా ఉండాలనే చూస్తారు. కొన్ని యాక్షన్ సీన్లు కూడా డూప్ లేకుండానే నటిస్తుంటారు.

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. ఐదుగురు ఆడవాళ్ల దొంగల మూఠాకి బాస్ గా నాని నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. అయితే షూటింగ్ సమయంలో స్పాట్ లో నాని కాలుకి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను పక్కనే ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించారు.

గతంలో కూడా ఒకటీ రెండు సినిమాల్లో నానికి గాయాలు అయ్యాయి…ఆ మద్య జెర్సీ మూవీ షూటింగ్ సమయంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ముక్కుకు గాయం అయ్యిందని అన్నారు. ఇప్పుడు మరోసారి గాయం కారణంగా నానిని పది రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందా డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.

ఇక గ్యాంగ్ లీడర్ తో పాటుగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు నాని.అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి ఓ ప్రయోగాత్మక సినిమా అని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news