Newsమహానటిలో పవన్ కళ్యాణ్..!

మహానటిలో పవన్ కళ్యాణ్..!

సావిత్రి జీవిత కథతో నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మహానటి. కీర్తి సురేష్ సావిత్రిగా నటించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా నటించి మెప్పించారు. సమంత, విజయ్ దేవరకొండ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఇక సినిమా కథగా చెప్పుకుంటే ఎంత కీర్తి ప్రతిష్టతలను అందుకుందో చివరి దశలో అన్ని ఇబ్బందులు పడుతూ చనిపోయింది సావిత్రమ్మ.

దానికి కేవలం మందు బానిసగా అవ్వడమే కాదు అందుకు కారణమైన పరిస్థితులు కూడా. హీరోయిన్ గా టాప్ గేర్ లో కెరియర్ నడుస్తున్న సమయంలో అప్పట్లోనే లక్షల కొద్ది డబ్బు చూసిన సావిత్రి దాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయలేకపోయింది. ఇక దానదర్మాల గురించి సినిమాలో అంత పెద్ద ఎత్తున ప్రస్థావించారంటే కచ్చితంగా దానికి మించే చేసి ఉండొచ్చు.

మంచి మనసు అని తెలుసు కాబట్టే ఆమెను వచ్చి డబ్బులు అడిగే వారు ఇక అలా చేసినా సరే ఎడమ చేత్తో ఇచ్చి కుడిచేతికి కూడా తెలియకుండా చేసేవారట. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వస్తే ప్రస్తుతం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దానదర్మాలు బాగా చేస్తాడని టాక్. మిగతా హీరోలు ఇలా ఇచ్చి అలా పబ్లిసిటీ కోసం అలా న్యూస్ బయటకు వచ్చేలా చేస్తే పవన్ మాత్రం పెద్ద ఎత్తున సాయం చేసినా కనీసం మాట వరసకి కూడా వార్తల్లో రానివ్వడు. ఇలా చూస్తే మహానటి సావిత్రికి, పవన్ కళ్యాణ్ కు దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి మహానటిలో పవన్ కళ్యాణ్ చూసిన వారైనా ఆయనకు ఎవరిని పడితే వారిని నమ్మొద్దని సలహాలు సూచనలు ఇస్తారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news