Movies" మహానటి " సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలావుందీ..?

” మహానటి ” సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలావుందీ..?

మహానటి సావిత్రి బయోపిక్ గా మహానటి టైటిల్ తో వస్తున్న సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం సినిమా తర్వాత ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడి మరి ఈ సినిమా తెరకెక్కించారు. స్వప్న సినిమా బ్యానర్లో స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుంది.

ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని ఈరోజు సెన్సార్ కు వెళ్లింది. సెన్సార్ నుండి ఈ సినిమా యు సర్టిఫికెట్ పొందడం విశేషం. సావిత్రిగా కీర్తి సురేష్ నటించగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, సమంత వంటి భారీ స్టార్ కాస్ట్ ఇందులో నటించారు. ఈ సినిమా సెన్సార్ వాళ్ల నుండి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

సావిత్రి జీవిత కథతో ఆమెను అభిమానించే ప్రేక్షకుల మనసులను గెలిచేలా ఈ సినిమాను తీర్చిదిద్దారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news