Gossipsఎన్టీఆర్ బయోపిక్ పై మహానటి ఎఫెక్ట్ .. రెట్టింపు అభినందనలు !

ఎన్టీఆర్ బయోపిక్ పై మహానటి ఎఫెక్ట్ .. రెట్టింపు అభినందనలు !

మహానటి ఎఫెక్ట్ తో బయోపిక్ ల మీద మళ్లీ దృష్టి పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఈమధ్యనే భారీ హంగామాతో మొదలైన ఎన్.టి.ఆర్ బయోపిక్ బాలకృష్ణ ఎంతో ప్రెస్టిజియస్ గా తీసుకున్నారు. తేజ డైరక్షన్ లో మొదలైన ఈ బయోపిక్ మధ్యలోనే వదిలేస్తున్నా అని షాక్ ఇచ్చాడు. ఎవరెవరో పేర్లు వినిపించినా వారెవరు ఫైనల్ కాలేదని తెలుస్తుంది. ఇక చంద్ర సిద్ధార్థ్ పర్యవేక్షణలో బాలకృష్ణనే సొంతంగా ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడని అన్నారు.

కాని తేజ మళ్లీ మనసు మార్చుకున్నాడని తెలుస్తుంది. ఈగో క్లాషెష్ వల్లే ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చిన తేజ మళ్లీ ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరక్షన్ చేసేందుకు సుముఖంగా ఉన్నాడట. దీనికి కారణం మహానటి సినిమా అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. మహానటి సక్సెస్ అయినందుకు నాగ్ అశ్విన్ కు ఎలాంటి ప్రశంసలు దక్కుతున్నాయో ఎన్.టి.ఆర్ సినిమా హిట్ అయితే తేజకు దానికి రెట్టింపు అభినందనలు వచ్చే అవకాశం ఉంది.

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. తేజ ఎక్సిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాబట్టి సైలెంట్ గా షూటింగ్ చేసి ఏదో ఒక టైం లో ఎనౌన్స్ చేద్దామని అనుకుంటున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news