Gossipsఐపీఎల్ స్టార్ అంబాసిడర్ గా ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ కు పండుగే..!

ఐపీఎల్ స్టార్ అంబాసిడర్ గా ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ కు పండుగే..!

బిగ్ బాస్ సీజన్ వన్ తో స్టార్ మాతో మంచి రిలేషన్ ఏర్పడటంతో ఎన్.టి.ఆర్ తో వారు మరో ప్రత్యేకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. త్వరలో మొదలవనున్న ఐపీఎల్ సీజన్ లో స్టార్ గ్రూప్ తెలుగు కామెంటరీని కూడా పెట్టబోతుంది. దీని కోసం దానిలో వచ్చే ప్రమోషనల్ యాక్టివిటీస్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంది.

ఇందుకోసం తారక్ కు భారీ మొత్తమే ముట్టచెబుతున్నారట. ఎన్.టి.ఆర్ చరిష్మా తెలుసుకున్న స్టార్ గ్రూప్ ఏదోవిధంగా ఎన్.టి.ఆర్ క్రేజ్ తో తమ ఛానెల్ ఇమేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. ఐపీఎల్ ప్రోమోస్, యాడ్స్ అన్నిటికి ఎన్.టి.ఆర్ బ్రాండింగ్ గా ఉంటాడు. బిగ్ బాస్ సీజన్ 2 ఎన్.టి.ఆర్ వదులుకున్నా అతంకుమించిన అవకాశం అందుకున్నాడని అంటున్నారు.

ఐపీఎల్ సీజన్ లో ఎన్.టి.ఆర్ హంగామా అంటే నందమూరి ఫ్యాన్స్ కు ఇంతకంటే పండుగలాంటి వార్త ఏదైనా ఉంటుందా. ప్రస్తుతం త్రివిక్రం సినిమాకు సిద్ధమవుతున్న తారక్ ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా కోసం వర్కవుట్స్ చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news