Moviesనితిన్ కెరియర్ లో ఇది హయ్యెస్ట్.. పవన్ హ్యాండా మజాకా..!

నితిన్ కెరియర్ లో ఇది హయ్యెస్ట్.. పవన్ హ్యాండా మజాకా..!

లవర్ బోయ్ ఇమేజ్ తో కెరియర్ సాగిస్తున్న నితిన్ అఆ తర్వాత లై తో మళ్లీ బొక్క బోర్లా పడ్డాడు. అందుకే ఈసారి పక్కా హిట్ ఫార్ములాతో వస్తున్నాడు. కృష్ణ చైతన్య డైరక్షన్ లో ఛల్ మోహన్ రంగ అంటూ రాబోతున్న నితిన్ ఈ సినిమాతో హిట్ కొట్టడం గ్యారెంటీ అంటూ నమ్మకంగా చెబుతున్నాడు. త్రివిక్రం కథ అందించిన ఈ సినిమా నిర్మాణంలో పవన్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు.

అందుకే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇష్క్ సినిమాకు పవన్ సెంటిమెంట్ సూపర్ హిట్ అయ్యిందని మళ్లీ అది రిపీట్ అయ్యేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను పిలిచాడు నితిన్. అయితే పవన్ హ్యాండ్ పండిందో లేదో ఈ సినిమా రేంజ్ పెరిగిపోయింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుండగా శాటిలైట్ రైట్స్ కూడా దుమ్మురేపుతుందట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం నితిన్ మూవీ రిలీజ్ కు ముందే 4.5 కోట్లకు అమ్ముడయ్యిందట. ఓ ప్రముఖ ఛానెల్ ఈ సినిమా రైట్స్ దక్కించుకుందట. నితిన్ కెరియర్ లో ఇది హయ్యెస్ట్ అని చెప్పొచ్చు. పవన్ మేనియాతో ఈసారి నితిన్ కెరియర్ లో స్ట్రాంగ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నడు. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. లై భామ మేఘా ఆకాష్ సినిమాలో నితిన్ కు జోడీగా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news