Moviesఅబ్బ సొత్తు కాదురా టాలెంటు.. అర్జున్ రెడ్డి కెమెరామన్ ఓ మేకప్...

అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. అర్జున్ రెడ్డి కెమెరామన్ ఓ మేకప్ మెన్ కొడుకు..!

లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని కలక్షన్స్ వర్షం కురిపిస్తున్న సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా షాలిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి డైరక్షన్ వహించారు. దర్శకుడి పనితనం ఏంటో ఈ సినిమాతో అర్ధమయ్యింది. ఇక ఈ సినిమా సక్సెస్ లో మరో పేరు వినపడుతుంది అదే చిత్ర సినిమాటోగ్రాఫర్ రాజు తోట.

ఓ మేకప్ మేన్ కొడుకు అయిన రాజు కెమెరామన్ గా అది సూపర్ హిట్ సినిమా అందించడం విశేషం. తండ్రి ఎలాగు మేకప్ మెన్ కాబట్టి సినిమాల మీద మక్కువ పెంచుకున్న రాజు సురేందర్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేరాడట. ఇక ఆ తర్వాత దాదాపు ఐదారేళ్లు హింది సినిమాలకు సెకండ్ యూనిట్ కెమెరామన్ గా పనిచేశాడట.

అర్జున్ రెడ్డి కథ వినగానే బాగా నచ్చిందని.. అందుకే సినిమా కోసం చాలా కష్టపడి కెమెరా వర్క్ చేశామని అంటున్నాడు రాజు తోట. ఇక ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు వేణు డైరెక్ట్ చేస్తున్న ‘నీది నాది ఒకే కథ’ సినిమాకు ఛాన్స్ వచ్చిందని. ఆ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నాడు రాజు తోట. టాలెంట్ నమ్ముకుంటే కాస్త లేట్ గా అయినా తనకు తగ్గ పేరు తప్పక వస్తుందని రాజుని చూసి మరోసారి చెప్పేయొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news