Gossipsరజినికాంత్ మహేష్ ఇద్దరు కలిస్తే..!

రజినికాంత్ మహేష్ ఇద్దరు కలిస్తే..!

సూపర్ స్టార్ రజినికాంత్ మరో సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తే.. అబ్బో ఇక అది చూసేందుకు రెండు కళ్ళు చాలవనే చెప్పాలి. స్పైడర్ తో తమిళ పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అవుతున్న మహేష్ అక్కడ పాగా వేయాలని బాగానె స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట.

ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా సూపర్ స్టార్ రజినికాంత్ వస్తారని టాక్. మురుగదాస్ సినిమాలను స్వతహాగా ఇష్టపడే రజినికాంత్ మహేష్ స్పైడర్ తమిళంలో రిలీజ్ ఈవెంట్ కు ప్రధాన ఆకర్షణ కానున్నాడు. రజిని మహేష్ ఇద్దరు ఎవరికి వారు సొంత అభిమానులున్న హీరోలు. మరి ఆ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద ఎలా సందడి చేయనున్నారో చూడాలి.

ఇక సినిమా విషయానికొస్తే స్పైడర్ మహేష్ సెప్టెంబర్ 27న రిలీజ్ ప్లాన్ చేశారు. దసరా బరిలో తారక్ తో పోటీ పడుతున్న మహేష్ స్పైడర్ తో హిట్ టార్గెట్ తో దిగుతున్నాడు. తెలుగులో ఎలా ఉన్నా సరే తమిళ మార్కెట్ పై మహేష్ వేసిన తలైవా ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యేట్టు ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news