Moviesలేడీ డైరక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గుండమ్మకథ.. కోరిక ఫలిస్తుందా..!

లేడీ డైరక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గుండమ్మకథ.. కోరిక ఫలిస్తుందా..!

ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించిన గుండమ్మ కథ సినిమా అలనాటి క్లాసిక్ సినిమాల్లో ఒకటని తెలిసిందే. ఈ సినిమా సీక్వల్ గా నేటితరం గుండమ్మ కథ తీయాలని చాలామంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కాని అది మాత్రం సాధ్యపడట్లేదు. ఎన్.టి.ఆర్ గా జూనియర్ ఎన్.టి.ఆర్, ఏయన్నార్ గా నాగ చైతన్య చేసినా గుండమ్మగా సూర్యాకాంతం లాంటి నటిని ఎక్కడ నుండి తీసుకురావాలో వారికి అర్ధం కావట్లేదు.

ఈ సినిమా తీయాలనే కోరిక ఉన్న డైరక్టర్ లో లేడీ డైరక్టర్ నందిని రెడ్డి కూడా చేరింది. గుండమ్మ కథ సినిమా సీక్వల్ చేయాలని ఉందని తారక్ ఒప్పుకుంటే చేసేస్తా అంటుంది. క్లాసిక్ సినిమా అది కూడా క్రేజీ మల్టీస్టారర్ అయిన ఈ ఛాన్స్ నందినికి ఇస్తారా అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలంటే ముందు ఆ గుండమ్మకు సరితూగే పాత్రను వెతికి పట్టుకోవాల్సిందే.

ఆ ప్రయత్నం చేసి ఈ సినిమా నిజంగానే నందిని రెడ్డి డైరక్షన్ లో రావాలని ఆశిద్దాం. ప్రస్తుతం ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉండటంతో గుండమ్మ కథ కోసం ఎన్.టి.ఆర్, చైతు రిస్క్ తీసుకుంటారా అన్నది కూడా అలోచించాల్సిన విషయమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news