Moviesవారి మీద అంతెత్తున కోప్పడిన రాజమౌళి!!

వారి మీద అంతెత్తున కోప్పడిన రాజమౌళి!!

బాహుబలి మొదటి భాగం లో కంటెంట్ కొత్తగా ఉన్నా చాలా సీన్ లు రాజమౌళి హాలీవుడ్ సినిమాల దగ్గర నుంచీ కాపీ కొట్టేసారు అనే రూమర్లు బాగా వినిపించాయి. వాటిల్లో కొన్ని నిజాలు కూడా లేకపోలేదు. రెండో పార్ట్ ట్రైలర్ సూపర్ హిట్ అయిన తరవాత కూడా అలాంటి విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. హీర్కులేస్ సినిమాలో బాణాలకి చాతీ పెట్టి నుంచునే సీన్ ఉండనే ఉంది అది ఇందులో వాడేసారు. ఇదే విషయం రాజమౌళి ని అడిగితే ఏమన్నారో తెలుసా .. ”వార్ సినిమాలంటే ఇక అవే సీన్లు వస్తాయి. అలాంటివే తీయాల్సి వస్తాయి. మీరు మిగిలిన కంటెంట్ చూడాలి కాని.. ఆ షాట్ అలాగే ఉంది అంటే మాత్రం కష్టం” అంటూ నిట్టూర్చాడు. అయితే ఇలా కాపీ షాట్ల గురించి అడగొద్దంటే మాత్రం కొందరు ఫీలవుతున్నారంతే. క్రిటిక్స్ మాత్రం హాలీవుడ్ వారు తీసే కొన్ని సినిమాల్లో అన్నీ వార్ సీన్స్ ఉన్నా ఎక్కడా కాపీ ఉండదు కదా అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news