News‘సోయా’తో పురుషులకు యమడేంజర్.. జాగ్రత్త!

‘సోయా’తో పురుషులకు యమడేంజర్.. జాగ్రత్త!

Spain and Brazil scientists combinely known a shocking fact in their research that Soya will dicrease the sperm count in ment.

పరదేశ శాస్త్రవేత్తలు తాజాగా కుండబద్దలయ్యే వార్తొకటి వెల్లడించారు. ముఖ్యంగా.. పురుషులకు వారు స్ట్ర్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో సోయా స్థాయి ఎక్కువైతే.. ఇక తండ్రి అవ్వడం కష్టమేనని వాళ్లు హెచ్చరిస్తున్నారు. వీర్యాన్ని దెబ్బతీసే కొన్ని రసాయనాలు సోయాలో ఎక్కువ మోతాదులో ఉన్నాయని తేలింది. స్పెయిన్‌లోని వాలెన్సియా వర్సిటీ, బ్రిటన్‌లోని ఐవీఐ ఫెర్టిలిటీ కేంద్రం నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఆ విషయం బయటపడింది.

నిజానికి.. సోయా పైపొరల్లో ఉండే ‘బిస్ఫెనాల్‌-ఏ’ అనే రసాయనం ప్రభావం మానవులపై ఏ స్థాయిలో ఉంటుందోనని గుర్తించడానికి వాళ్లు ఈ అధ్యయనం చేపట్టారు. ఈ పరీక్ష 25 మంది పురుషులపై ప్రయోగించారు. దాదాపు రెండేళ్లపాటు వారి ఆహారంలో సోయా స్థాయి ఎక్కువగా ఉండేలా చూశారు. ఈ క్రమంలోనే ఊహించని రీతిలో ఫైటోఈస్ట్రోజన్‌గా పిలిచే మరో రసాయన ప్రభావం దీనిలో వెలుగు చూసింది. ఇది వీర్యకణాల ఉత్పత్తి వేగాన్ని తగ్గించడంతోపాటు క్రోమోజోమ్‌ల నిష్పత్తిపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోందని వారి ప్రయోగంలో వెల్లడైంది.

దీంతో.. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో సోయా స్థాయి చాలా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు పాటించమని పేర్కొంటున్నారు. లేదంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తీసుకునే ఆహారంలో సోయా ఉంటే, బుల్లెట్లు లేని గన్ పరిస్థితి అన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news