Gossipsఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ...

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత జై లవకుశ తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఆశగా ఎదురుచూసారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ నటించే తర్వాత సినిమాపై టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో అప్పుడే చాలా రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.త్రివిక్రమ్ తో సినిమా అయితే ప్రకటించారు కానీ దానికి సంబందించిన ఎటువంటి అప్ డేట్స్ మనకి అందటం లేదు.మొన్నామధ్య దిల్ రాజు సతీమణి చనిపోయినపుడు దిల్ రాజు ఇంటి దగ్గర ఇద్దరు కలిసి కెమెరాలకి చిక్కారు.

అయితే ఎన్టీఆర్ ఒక దిమ్మదిరిగే కాంబినేషన్ లో సినిమా కథ విన్నాడట ఆ కథ చాలా బాగా వచ్చిందంట…అది కూడా అల్లు అర్జున్ తో కాంబినేషన్ లో కనుక ఆ సినిమా చేస్తే చాలా బాగుంటుందంట. ఆ సినిమా ని వర్కవుట్ చెయ్యడానికి చర్యలు జరుగుతున్నాయంట .అసలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే మహా పిచ్చి లేస్తుంది అభిమానులకి. నందమూరి అభిమానులని, మెగా అభిమానులని వేర్వేరుగా ఉన్నప్పటికినీ అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ ఇద్దరినీ ప్రేమించే వారు, అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. అవును ఇప్పటి ట్రెండుకి తగ్గట్లు హీరోలు అభిమానుల లెక్కలు మాని ఒక మంచి కథ కోసం కనుక కలిసి పనిచేస్తే బాహుబలి లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు వస్తాయి. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. వారిద్దరు చాలా సన్నిహితం గా ఉంటారు. ఒకవేళ త్రివిక్రమ్ తో సినిమా కనుక ఈ కథ తోనే కనుక అయితే అభిమానులకి పిచ్చి లేవటం ఖాయం. ఏమంటారు ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news