Moviesఅల్లు అరవింద్ ఖతర్నాక్ ప్లాన్..అప్పుడు బాలకృష్ణ..ఇప్పుడు హోస్ట్ గా మరో స్టార్..!!

అల్లు అరవింద్ ఖతర్నాక్ ప్లాన్..అప్పుడు బాలకృష్ణ..ఇప్పుడు హోస్ట్ గా మరో స్టార్..!!

జనరల్ గా ఒక సామెత ఉంటుంది. మన ఇళ్లలో చాలామంది వాడుతూ ఉంటారు. పొట్టోలు చాలా గట్టివాళ్లు.. ఇప్పుడు అదే ఫార్ములా ని అల్లు అరవింద్ పై వాడుతున్నారు జనాలు. ఎస్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్.. ఈ మధ్యకాలంలో పట్టిందల్లా బంగారం గా తయారవుతుంది. కేవలం రెండే రెండు కోట్లతో డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకున్న కాంతారా ఆయనకు ఎన్ని కోట్ల లాభాలు తెచ్చి పెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .

అంతే కాదు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేసిన ఆహా ఓటిటి నెంబర్ వన్ ఓటీటీగా దూసుకుపోతుంది. ఈ ఓటిటిలో ప్రసారమయ్యే ప్రతి షో హ్యూజ్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకొని ఓటిటిలకే బాబుగా తయారైంది . మరీ ముఖ్యంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏవిధంగా దూసుకుపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ప్రోమో వచ్చిందంటే సెకండ్స్ లోనే మిలియన్ వ్యుయ్స్ దాటేస్తున్నాయి. అంత టాప్ టిఆర్పి రేటింగ్స్ సంపాదించుకుంది .

కాగా ఇప్పుడు అల్లు అరవింద్ మరో ఖ్తర్నాక్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది . టాలీవుడ్ కమెడియన్గా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం హోస్ట్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారట అల్లు అరవింద్ . ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ప్రోగ్రాం ప్లాన్ రెడీ అయిందని ..ఈ నెల లాస్ట్ లో ఆహాలో ఈ కామెడీ ప్రోగ్రాం స్టార్ట్ కాబోతుందని ..దీనికోసం బ్రహ్మానందం కూడా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది . ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందని ..జబర్దస్త్ మించిపోయే కామెడీతో హెల్ది అండ్ హ్యాపీగా నవ్వుకునేలా ఉండబోతుంది అంటూ సమాచారం లీక్ అయింది . అంతేకాదు దీనికోసం అల్లుఅర్జున్ ఏకంగా ముంబై నుంచి ఒక ప్రత్యేక రంగంలోకి దింపారట . కని విని ఎరుగని విధంగా టాప్ కామెడీ షో గా ఈ ప్రోగ్రాం పేరు తెచ్చుకోవడానికి అల్లు అరవింద్ కోట్లు కుమ్మరిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే అల్లు అరవింద్ ఈ మధ్యకాలంలో బ్రెయిన్ కి బాగా పదును పెట్టి మరీ పనులు చేస్తున్నాడు అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news