Moviesప్రేమ‌క‌థ‌లో తార‌క్ ర‌చ్చ చేస్తాడా... బ్లాక్‌బ‌స్ట‌ర్ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా ఫిక్స్‌..!

ప్రేమ‌క‌థ‌లో తార‌క్ ర‌చ్చ చేస్తాడా… బ్లాక్‌బ‌స్ట‌ర్ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా ఫిక్స్‌..!

RRR విడుదల తర్వాత ఎన్టీఆర్ ఆరు నెలలుగా త‌న కొత్త సినిమా స్టార్ట్ చేయ‌లేదు. కొర‌టాల శివ సినిమాపై ఆరేడు నెల‌లుగా ఊరించే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్‌తోనూ పాన్ ఇండియా సినిమాపై ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చేసింది. ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్లో 30, 31వ ప్రాజెక్టులుగా ప‌ట్టాలు ఎక్కుతున్నాయి. మ‌ధ్య‌లో ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా పేరు కూడా ఎన్టీఆర్ లైన‌ప్‌లో వినిపించింది.

ఉప్పెన సినిమా వ‌చ్చాక రెండేళ్లుగా బుచ్చిబాబు ఏ సినిమా చేయ‌లేదు. ఎన్టీఆర్ కోస‌మే యేడాదికి పైగా ఖాళీగా ఉన్నాడ‌ని అన్నారు. అయితే ఇంకా కొర‌టాల సినిమా ప‌ట్టాలు ఎక్క‌క‌పోవ‌డం.. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్టు కూడా వెంట‌నే ఉండ‌డంతో బుచ్చిబాబు సినిమా ఇప్ప‌ట్లో ప‌ట్టాలు ఎక్కేలా లేదు. ఈ ప్రాజెక్టులు ఇలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

రీసెంట్‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన ఓ యంగ్ డైరెక్ట‌ర్ ఎన్టీఆర్‌కు స్క్రిఫ్ట్ నెరేట్ చేసిన‌ట్టు తెలిసింది. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు సీతారామం సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన హ‌ను రాఘ‌వ‌పూడి ఓ అద్భుత‌మైన ల‌వ్‌స్టోరీని ఎన్టీఆర్‌కు చెప్పాడ‌ట‌. ఇదో బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరీ అని… ఎన్టీఆర్ స‌రికొత్త‌గా ఈ ప్రేమ‌క‌థ‌లో ఆవిష్కృతం కాబోతాడ‌ని అంటున్నారు. రీసెంట్‌గా హ‌ను రాఘ‌వ‌పూడి సీతా రామం లాంటి క్లాసిక్ ల‌వ్ స్టోరీని తెర‌కెక్కించిన తీరుకు తెలుగు సినీ ల‌వ‌ర్స్ ఎంత ఫిదా అయిపోయారో చూశాం.

ఇప్పుడు హ‌ను క‌థ‌ను ఎన్టీఆర్ ఓకే చేసినా కూడా ఇప్ప‌ట్లో ఈ ప్రాజెక్టు అయితే ప‌ట్టాలు ఎక్కుతుంద‌ని అనుకోలేం. కొర‌టాల‌, ప్ర‌శాంత్ నీల్ సినిమాలు పూర్త‌య్యే స‌రికే రెండేళ్లు ప‌డుతుంది. ఆ త‌ర్వాతే ఇది ఉండే ఛాన్స్ ఉంది. క్లాసిక్ డైరెక్ట‌ర్ అయిన హ‌ను మాస్ హీరో ఎన్టీఆర్ కాంబోలో సినిమా అంటే అది ఖ‌చ్చితంగా ఇంట్ర‌స్టింగ్ కాంబో కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news