Moviesఆ టాలీవుడ్‌ ఫ్యామిలీ హీరోలే ప్రియ‌మ‌ణికి ఇంత దెబ్బేశారా... అస‌లేం జ‌రిగింది...!

ఆ టాలీవుడ్‌ ఫ్యామిలీ హీరోలే ప్రియ‌మ‌ణికి ఇంత దెబ్బేశారా… అస‌లేం జ‌రిగింది…!

దగ్గుబాటి హీరోల వల్ల రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియమణికి దెబ్బపడిందే తప్ప ఒరిగిందేమీ లందంటున్నారు. నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి అంటే ఇప్పటికీ అటు తమిళంలో, ఇటు తెలుగులో గాని క్రేజ్ ఉంది. అందుకే, పెళ్ళై గ్యాప్ తీసుకున్నా కూడా మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ వారు ఒకేసారి రెండు సినిమాలలో అవకాశాలిచ్చారు. ఆ సినిమాలే నారప్ప, విరాటపర్వం సినిమాలు. నారప్పలో విక్టరీ వెంకటేష్ సరసన నటించింది. తమిళంలో ధనుష్ నటించిన కల్ట్ కంటెంట్ సినిమాకి తెలుగులో నారప్ప‌ అధికారిక రీమేక్.

ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం ప్రియమణి హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా పరుత్తి వీరన్. ఈ సినిమాతో అటు తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకోవడమే కాదు.. ఏకంగా జాతీయ అవార్డ్‌ను అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎవరే అతగాడు, పెళ్ళైన కొత్తలో సినిమాలు చేసింది. వీటిలో పెళైన కొత్తలో సినిమా తెలుగులో మంచి పాపులర్ తెచ్చుకుంది. దాంతో ఇక్కడ సినిమాలు చేసి బాగానే పాపులర్ అయింది.

ప్రియమణి నటించిన యమదొంగ తన కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి సినిమా. నాగార్జునతో రగడ, గోపీచంద్‌తో గోలీమార్, నితిన్‌తో ద్రోణ లాంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది. అంతేకాదు, చారులత అనే సినిమాతోనూ నటించి పర్ఫార్మెన్స్ పరంగా అందరి ప్రశంసలు అందుకుంది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రియమణి ముస్తఫ్ఫా రాజ్‌ను పెళ్లి చేసుకుంది. దాంతో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. కానీ, బుల్లితెరమీద మాత్రం జోరు సాగిస్తోంది.

ఇక హీరోయిన్‌గా మళ్ళీ రీ ఎంట్రీ అది కూడా వెంకటేష్, రానాల సినిమా అనగానే మళ్ళీ పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్స్‌లో అవకాశాలు వస్తాయని..రీ ఎంట్రీ మరో లెవల్‌లో ఉంటుందని ఊహించుకుంది. కానీ, ప్రియమణి కి ఈ దగ్గుబాటి హీరోల సినిమాల వల్ల ఏమాత్రం కలిసి రాలేదు. వెంకటేష్ సినిమా అయితే, ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం వెంకీకే దక్కింది. ఇక విరాట పర్వం మాత్రం డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఇప్పటివరకు అవకాశాలు దక్కలేదు. మరి మన సీనియర్ హీరోలెవరైనా పట్టించుకుంటారేమో చూడాలి.

Priyamani first look released from Virata Parvam/manatelangana.news

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news