Moviesనువ్వు నల్లగా ఉన్నావంటూ దూరం పెట్టిన స్టార్ హీరో.. ఏడ్చేసిన బెన‌ర్జీ...

నువ్వు నల్లగా ఉన్నావంటూ దూరం పెట్టిన స్టార్ హీరో.. ఏడ్చేసిన బెన‌ర్జీ ..!?

సినీ ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారని తెలుసు కానీ మరి ఇలా రంగును బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారా..? అని బెనర్జీ ని దూరం పెట్టాకనే అర్థం అవుతుంది . అలా చేసింది ఓ స్టార్ హీరో అని తెలిసాక షాక్ కావాల్సిందే . బెనర్జీ నల్లగా ఉన్నాడు అంటూ స్టార్ హీరో సినిమా షూటింగ్లో తన పక్కన కూర్చోడానికి కూడా ఆలోచించాడట ఓ స్టార్ హీరో. ఆనాడే ఈ సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో అర్థం అయిపోయిందట బెనర్జీకి.

బెనర్జీ గా పేరు గాంచిన మాగాంటి వేణు బెనర్జీ ఒక తెలుగు సినిమా నటుడు. తనదైన స్టైల్ లో యాక్టింగ్ చేస్తూ ఎక్కువగా సహాయ పాత్రలో.. విలన్ గా నటించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఆయనకు 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. సహాయ దర్శకుడుగా తన ప్రస్థానం ప్రారంభించి.. ఆ తర్వాత మెల్లమెల్లగా క్రమీణ నటుడుగా మారాడు. దర్శకుడిగా మెప్పించలేకపోయినా బెనర్జీ నటుడుగా మాత్రం అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే బెనర్జీ ఓ స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటిస్తున్న టైం లో ఆ స్టార్ హీరో షూటింగ్ తర్వాత ఆయన పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడలేదట. ప్రస్తుతం ఇదే విషయం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. బెనర్జీ ప్రజెంట్ సినిమాలు చేస్తుంది చాలా తక్కువ. అయితే ఒకప్పుడు ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు .

ప్రతి స్టార్ హీరో సినిమాలో ఈయన కనిపించాల్సిందే . అంతే కాదు ఈయన కనిపిస్తే విలన్ పాత్ర చేస్తే ఆ సినిమా హిట్ అంటూ పొగిడేసేవారు. మరి అంత మంచి నటుడు నీ కేవలం తాను నల్లగా ఉన్నాడు అని చెప్పి ఇండస్ట్రీ కి సంబంధించిన స్టార్ హీరో అతని దూరం పెట్టడం సమంజసమేనా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బెనర్జీ లాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఇండస్ట్రీకి అవసరమని ఆయన మళ్లీ సినిమాలు చేస్తే చూడాలి అని కోరుకుంటున్నామని కొందరు నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ఈయన తన రీ ఎంట్రీని ఎలా ప్లాన్ చేసుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news