Moviesబిగ్ బ్లాస్టింగ్ అప్డేట్..ఆ స్టార్ హీరో సినిమాలో మహేశ్ బాబు..ఫ్యాన్స్ కు...

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్..ఆ స్టార్ హీరో సినిమాలో మహేశ్ బాబు..ఫ్యాన్స్ కు పండగే..?

యస్..తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే అనిపిస్తుంది. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న హీరో మహేశ్..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఇప్పటికే పూజా కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్..జూలై లో మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ మార్చే పనిలో ఉన్నారట. ఈ సినిమాలో మహేశ్ సరసన రెండోసారి హీరోయిన్ గా కనిపిస్తుంది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.

ఇక ఈ సినిమా తరువాత రాజమౌళితో ఓ సినిమాకి కమిట్ అయ్యాదు మహేశ్. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇది ఇలా ఉండగా..ఈ మధ్యలోనే మహేశ్ ఓ స్టార్ హీరో సినిమాలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్..వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలయదళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్. అందులో ఎలాంటి సందేహం లేదు. నెగిటివ్ టాక్ లో కూడా బీస్ట్ సూపర్ కలెక్షన్స్ సాధించింది.

తమిళనాట సూపర్ మాస్ క్రేజ్ ఉన్న హీరో ఫస్ట్ టైం డైరెక్ట్ గా తెలుగులో మూవీ చేస్తుండడం తో ఈ సినిమా పై స్టార్స్ కూడా భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. అయితే, ఈ సినిమాలో కధ అనుసారం ఓ స్పెషల్ రోల్ ఉందని..దానికి మహేష్ బాబు అయితే పర్ ఫెక్ట్ గా ఉంటాడు అని..వంశీ పైడిపల్లి ఈ రోల్ కి మహేశ్ ను సెలక్ట్ చేసారట. ఇప్పటికే ఈ విషయం మహేశ్ తో చర్చించగా..మహేశ్ కూడా ఓకే చెప్పిన్నత్ళు తెలుస్తుంది. మనకు తెలిసిందే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ మహర్షి అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాదు మహేశ్ కి. ఇక ఆ చనువుతో..మహేశ్ గెస్ట్ రోల్ కి ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news