Moviesకోరికలు బాగానే ఉన్నాయి..మరి దాని సంగతేంటి నజ్రియా పాప ..?

కోరికలు బాగానే ఉన్నాయి..మరి దాని సంగతేంటి నజ్రియా పాప ..?

నజ్రియా ఫహద్.. ఈ పేరు మన తెలుగు వాళ్లకి కొత్తగా అనిపించినా..మలయాళంలో మాత్రం సూపర్ స్టార్ హీరోయిన్. ఇక ఈమె భర్త నెం 1 హీరో. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ అంటూ పుష్ప ను ముప్పుతిప్పలు పెట్టిన నటుడే నజ్రియా లవబుల్ భర్త. మలయాళంలో గొప్ప యాక్టర్. ఇప్పుడు తెలుగు , తమిళ భాషలల్లో సినిమాలకు కమిట్ అవుతూ బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గా నజ్రియా నజీమ్ నటించిన తెలుగు సినిమా “అంటే..సుందారినికి”.

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 10 న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇంటార్ క్యాస్ట్ లవ్ గురించి..ఇద్దరు వేరు వేరు మతాలకు సంబంధించిన అమ్మాయి, అబ్బాయి..ప్రేమించుకుంటే..ఇంట్లో వాళ్ళ నుండి వచ్చే ప్రాబ్లమ్‌స్ సినిమాలో ఫుల్ ఫన్ వే గా లాకొచ్చారు అని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమైపోతుంది.


కాగా, సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా నజ్రీయా నజీమ్..ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చింది. ఈ క్రమంలోనే అమ్మడు మాట్లాడుతూ తన భర్త గురించి..ఫ్యామిలీ గురించి..సినిమా గురించి బోలెడు విషయాలు చెప్పుకొచ్చింది. సినిమాలో తన రోల్ చాలా కొత్తగా ఉంటుందని..ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుందని చెప్పిన నజ్రియా..ఖచ్చితంగా సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది.

ఇక తన తదుపరి సినిమాల గురించి రిపోర్టర్ ప్రశ్నించగా..ఆమె మాట్లాడుతూ..”ఇప్పటి వరకు అయితే,,ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు కానీ, కధలు వింటున్నా..నాకు తెలుగులో తారక్, మహేశ్ బాబు,బన్నీ”..ఇలాంటి హీరోల తో సినిమా చెయ్యాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే, దీని పై నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కోరిక బాగానే ఉన్నాయి..కానీ, నీ హైట్ కు వాళ్ళ పక్కన నటిస్తే అంత లుక్స్ బాగోవు..పైగా నువ్వు చూడటానికి చాలా యంగ్ గా ఉన్నావు చెల్లి రోల్ కి అయితే, నువ్వు బాగా సెట్ అవుతావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి నజ్రియా కోరికను మన హీరోలు తీరుస్తారా లేదా అని..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news