Moviesధ‌నుష్‌తో బెడ్‌సీన్‌... ఘాటు రిప్లై ఇచ్చిన క్రేజీ హీరోయిన్‌...!

ధ‌నుష్‌తో బెడ్‌సీన్‌… ఘాటు రిప్లై ఇచ్చిన క్రేజీ హీరోయిన్‌…!

ప్ర‌స్తుతం అంతా సోష‌ల్ మీడియా యుగం అయిపోయింది. ఈ సోష‌ల్ మీడియా యుగంలో ఎవరు ? ఏం చేసినా దానికి నెటిజ‌న్లు పెడార్థాలు తీసేస్తున్నారు. మార్ఫింగ్‌లు, ట్రోలింగ్‌ల‌తో మామూలు ర‌చ్చ చేయ‌డం లేదు. ఇక సెల‌బ్రిటీలు అయితే ఈ మార్ఫింగ్‌లు, ట్రోలింగ్‌ల‌కు బాగా గుర‌వుతున్నారు. అటు సెల‌బ్రిటీలు కూడా త‌మ జీవితంలో ఏం జ‌రిగినా సోష‌ల్ మీడియా ద్వారా త‌మ అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

అయితే కొంద‌రు అల్ల‌రి చిల్ల‌రి నెటిజ‌న్లు ఆ ఫొటోల‌ను ఆస‌రాగా తీసుకుని సెల‌బ్రిటీల‌కు పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌లు వేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ.. వారిలో అస‌హ‌నాన్ని తట్టిలేపుతూ ఉంటారు. కొంద‌రు హీరోయిన్లు అప్పుడ‌ప్పుడు పిచ్చి ప్ర‌శ్న‌ల‌తో చికాకు ప‌డుతూ ఉంటారు. హీరోయిన్లు చిట్ చాట్ చేసేట‌ప్పుడు, అభిమానుల‌తో ముచ్చ‌టించేట‌ప్పుడు దారుణ‌మైన ట్రోలింగ్‌కు గుర‌వుతూ ఉంటారు.

ఇప్పుడు మాళ‌విక మోహ‌న‌న్‌కు కూడా అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. మాళ‌విక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తుంది. తాజాగా ఆమె ఫ్యాన్స్‌తో క్వ‌శ్చ‌న్ అండ్ అవ‌ర్ సెష‌న్ నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు వేసిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె ఆన్స‌ర్ ఇచ్చింది. అయితే ఓ నెటిజ‌న్ కాస్త ఓవ‌ర్ అయ్యాడు. మార‌న్ సినిమాలో బెడ్ సీన్‌ను ఎన్నిసార్లు షూట్ చేశారు ? అని అడిగాడు.

వెంట‌నే మాళ‌విక నీ త‌ల‌లో ఏదో పాడైపోయిన‌ట్టు ఉంది.. అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మాళ‌విక భ‌లే మంచి రిప్లే ఇచ్చిందిలే అని నెటిజ‌న్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. ఇక మాళ‌విక త‌మిళంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ తో పెట్టా,విజ‌య్‌తో మాస్ట‌ర్ సినిమాల్లో న‌టించింది. ఇక హీరో ధ‌నుష్‌తో క‌లిసి న‌టించిన మార‌న్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news