ఇది నిజం అఖండ రిజల్ట్ చూశాక.. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఇదే రకమైన ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, చరణ్ ఇద్దరూ ఉన్నా కూడా ఆచార్య డిజాస్టర్ అయ్యింది. అసలు రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి తన స్థాయికి తగిన కథలు ఎంచుకోవడం లేదని మెగాభిమానులు బాధపడుతున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా సేమ్ టు సేమ్. ఇతర భాషల్లో హిట్ అయ్యి… అవి తెలుగులో డబ్ అయ్యి.. ఇక్కడ యూట్యూబుల్లో తిరగేసిన సినిమాలనే మరోసారి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అది కూడా నాలుగైదేళ్ల తర్వాత.. దీంతో పవన్ ఫ్యాన్స్ లబోదిబోమంటున్నారు.
వరస పెట్టి పవన్ చేసేవి ఈ రీమేకులే..! ఇప్పుడు చిరు కూడా అదే బాటలో వెళుతున్నాడు. రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 రీమేక్, సైరా పక్కన పెడితే ఆచార్య నాసిరకం కథ. అందుకే చెర్రీ ఉన్నా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆచార్య తర్వాత కూడా చిరు రీమేకుల మీదే ఆధారపడుతోన్న పరిస్థితి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తోన్న భోళాశంకర్ ( లూసీఫర్ రీమేక్) – మోహనరాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ ( లూసీఫర్ రీమేక్) – ఇక వాల్తేరు వీరయ్య స్ట్రైయిట్ అంటున్నా బాబీ రొటీన్ సినిమాలు చూసిన మెగాభిమానులకు ఆ సినిమాపై కూడా పెద్ద ఆశలు, అంచనాలు లేవు.
ఓ వైపు పవన్ సినిమాలు హిట్ అవుతున్నా కలెక్షన్లు లేకపోవడానికి, క్రేజ్ తగ్గడానికి కారణం వరుస రీమేకులు.. ఇప్పుడు చిరు కూడా అదే బాటలో వెళుతుండడంతో సినిమాలను ఫ్యాన్స్ కూడా ఇష్టపడడం లేదు. ఆచార్య బజ్, ఓపెనింగ్సే ఇందుకు ఉదాహరణ. అయితే ఇప్పుడు చిరు అభిమానులు కూడా బాలయ్యతో కంపేరిజన్ చేసుకుని ఫీల్ అవుతున్నారు. బాలయ్య లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని వారు చెపుతున్నారు.
అఖండలో బాలయ్య చేసిన అఘోరా క్యారెక్టర్‌కు బాలయ్య అభిమానులే కాదు చిరు అభిమానులు సైతం ఫిదా అయిపోయారు. ఈ వయస్సులో అఖండ లాంటి రోల్ చేయడం నిజంగా అందరిని ఫిదా చేసింది. శభాష్ బాలయ్యా అని మెచ్చుకోవడంతో పాటు ఈ రోల్ బాలయ్య తప్పా ఎవ్వరూ చేయలేరని మెచ్చుకున్నారు. బాలయ్య నెక్ట్స్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అది కూడా సగటు సినీ అభిమానులతో పాటు మెగాభిమానులకు కూడా పిచ్చెక్కించేస్తోంది.
ఇప్పుడు మలినేని గోపీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా వస్తోంది. ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ బోయపాటి సినిమా ఉంది. ఈ సినిమాల్లో పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతున్నాయి. చిరు కూడా అదే తరహా కథలు ఎంచుకోవడంతో పాటు ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేయాలని మెగాభిమానులు కోరుకుంటున్నారు.