Moviesఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్.. “భీమ్లా” పై కేకపుట్టించే అప్డేట్..!!

ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్.. “భీమ్లా” పై కేకపుట్టించే అప్డేట్..!!

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. ​ఈ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ట్రెండింగ్ లో ఉంచేందుకు ట్రై చేస్తోంది.

2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అమదుకు మెయిన్ రీజన్.. మెగాస్టార్ చిరంజీవి. యస్..ఆయన నటించిన “ఆచార్య” చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయాలని భావిస్తున్నారని.. ఈ మేరకు దర్శక నిర్మాతలు ‘భీమ్లా నాయక్’ మేకర్స్ తో చర్చలు జరిపారని టాక్ విబిపిస్తుంది. అంతేకాదు ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని రిపబ్లిక్ డే వీక్ కు వాయిదా వేస్తున్నారని రూమర్స్ వచ్చాయి.

కానీ, ఇవన్ని ఓట్టి పుకార్లే అని.. ఏట్టి పరిస్ధితిల్లో ఈ చిత్రం రిలీజ్ డేట్ లో మార్పు లేదని అనుకున్న సమయానికే వస్తుందని క్లారిటీ ఇచ్చారు భీమ్లా నాయక్ చిర బృందం. ‘బ్రేక్ టైమ్ ఇన్ భీమ్లా నాయక్’ అనే పేరుతో పవన్ కు సంబంధించిన ఓ స్మాల్ వీడియోని వీడియోని విడుదల చేస్తూ..ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఇక అన్న కోసం తమ్ముడు పవన్ ఖచ్చితంగా ఈ సినిమా వాయిదా వేసుకుంటాడు అనుకున్న వాళ్లకి పవన్ ఈ విధంగా ఊహించని షాక్ ఇచ్చారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news