మెగా ఫ్యామిలీ ఇంట మరో రెండు రోజుల్లో పెళ్లి బజాలు మోగనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో గ్రాండ్గా చేయడానికి మెగా ఫ్యామిలీ రెడీ అవుతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన అందరూ ఇటలీకి బయలుదేరి వెళ్లారు. మొత్తం మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలో నవంబర్ 1న పెళ్లి జరగనుంది.
అయితే ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి కూడా ఆహ్వానం అందింది. పెళ్ళికొడుకు వరుణ్ తేజ్‌కి రేణు దేశాయ్ పిన్ని అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఇప్పటికే తన మూడో భార్య అన్నాలెజ్‌నోవాతో కలిసి వరుణ్ తేజ్ పెళ్లిలో పాల్గొనేందుకు లండన్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్.. వరుణ్ తేజ్ పెళ్లిపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు. వరుణ్ తేజ్ పెళ్లికి నాకు కూడా ఆహ్వానం అందింది.. అయితే తాను మాత్రం ఈ పెళ్లికి వెళ్ళటం లేదని చెప్పింది.
అలాగే నిహారిక పెళ్లికి కూడా తనకు ఇన్విటేషన్ వచ్చింది.. కానీ నేను పోలేదు పిల్లలను పంపించాను అని పేర్కొంది. ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే నాకు మంచి అనుబంధం ఉంది. 8 ఏళ్ల వయసు నుంచి నేను వరుణ్ తేజ్‌ను చూస్తున్నాను. నా కళ్ళముందే పెరిగాడు. అయితే అతడి పెళ్లికి వెళ్లాలని నాకు లేదు.. నా బెస్ట్ విషెస్ మాత్రం ఎప్పుడు ఉంటాయి.. అని రేణు దేశాయ్ పేర్కొంది.
మరి వరుణ్ తేజ్ పై తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూనే ఈ పెళ్లికి మాత్రం వెళ్ళనని రేణు ఎందుకు చెప్పింది అంటే.. దానికి ప్రత్యేకంగా కారణం ఏం లేదు… ? పవన్ అక్కడ తన మూడో భార్య అన్నాతో కలిసి పెళ్లికి వెళ్ళాడు. ఈ టైంలో రేణు దేశాయ్ వెళితే ఎంత మాత్రం ? బాగుండదన్న కారణంతోనే రేణు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది.