News' గుంటూరు కారం ' స్టోరీ లైన్ ఇదే... క‌థ త్రివిక్ర‌మ్...

‘ గుంటూరు కారం ‘ స్టోరీ లైన్ ఇదే… క‌థ త్రివిక్ర‌మ్ స్టైల్లో లేదే… కొత్త‌గా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో వరుసగా ఐదో సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. మహేష్ బాబుకి జోడిగా శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా కీలక పాత్రలో రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, రఘుబాబు, జగపతిబాబు, సునీల్, ఆలీ తదితరులు నటిస్తున్నారు.

శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో దిమ్మ తిరిగిపోయేలా చర్చ‌కి వస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా రు. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కలుపుకుంటే తెలుగు భాషలోనే రు. 150 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే దాదాపు రు. 155 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది. కేవలం తెలుగు భాషలో మాత్రమే ఈ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగటం టాలీవుడ్ చరిత్రలోనే రికార్డుగా నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ లైన్ ఇండస్ట్రీ వర్గాలలో లీక్ అయింది. గుంటూరు నగరంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు పనిచేస్తున్న ఓ లేడీ జర్నలిస్టును విలన్లు టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలోనే గుంటూరు కారం అంతటి ఘాటైన యువకుడు ఆమె వెంట పడటం.. ఆమెతో ప్రేమలో పడటం అనంతరం విలన్‌కు ఎదురు తిరగటం అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందట. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా ఏళ్ల తర్వాత మంచి మాస్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా మీనాక్షి చౌదరి జర్నలిస్టుగా అతని ప్రేయసి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది.

మీనాక్షి చౌదరి పాత్ర ఇంటర్వెల్ తో ఎంటర్ అయి.. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుందని.. సెకండాఫ్ సినిమా అంతా మీనాక్షి చౌదరి పాత్ర చుట్టూ నడుస్తుందని తెలుస్తోంది. ఇక శ్రీలీల పాత్ర సినిమా ఫస్టాప్ లో ఉంటుందట. త్రివిక్రమ్ అంటేనే యాక్షన్ తక్కువగా.. ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఎమోషన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ తన స్టైల్ కు కాస్త భిన్నంగా వెళుతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీ తక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news