News' భ‌గ‌వంత్ కేస‌రి ' .. బాల‌య్య‌ కుమ్మేయ‌డం ఖాయం... ఈ...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ .. బాల‌య్య‌ కుమ్మేయ‌డం ఖాయం… ఈ రెండు సాక్ష్యాలే చాలు…!

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాl పాత్రలో.. డైరెక్టర్ అనిల్ రాfrపూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన భగవంత్‌ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీ..ల బాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ప్రచార చిత్రాలు.. ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

బాలయ్య తన కెరీర్లో ఎప్పుడూ లేనట్టుగా అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్టులతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. భగవంత్‌ కేసరి బాలయ్యకు చాలా ఏళ్ల తర్వాత హ్యాట్రిక్‌ హిట్ సినిమా అవుతుందన్న ధీమా అందరిలోనూ కనిపిస్తోంది. బాలయ్య కచ్చితంగా ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కుమ్మేయటం ఖాయం అన్న చర్చే ఎక్కువ న‌డుస్తోంది.

సంక్రాంతికి గ‌ట్టి పోటీలో వ‌చ్చి.. తొలి రోజు సోలోగా రిలీజ్ అయిన వీర‌సింహారెడ్డి ఫ‌స్ట్ డే రు.54 కోట్ల వ‌సూళ్లు సాధించింది. భ‌గ‌వంత్ కేస‌రి ఫ‌స్ట్ డే అంత‌కు మించిన వ‌సూళ్లు కొల్ల‌గొట్టేలా ఉంది. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటివరకు 15 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతోంది.

అటు బుక్ మై షో లోను ఏకంగా 1. 50 లక్షల ఇంట్రెస్ట్ లను అందుకుంది. దీనిని బట్టి చూస్తుంటే బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది. ఏదేమైనా బాల‌య్య సినిమాపై అంచ‌నాలు, క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news