టాలీవుడ్ యంగ్‌టైగర్… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమా డ్రాగన్ షూటింగ్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే అటు వార్ 2 కూడా త్వరగా పినిష్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ తో తారక్ కలిసి నటిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాపై దేశవ్యాప్తంగా అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అటు నార్త్‌లో హృతిక్ రోషన్ ఉండడంతో సినిమాకు ప్లస్ అవుతోంది.ఇటు టాలీవుడ్‌లో ఎన్టీఆర్ క్రేజ్ ఈ సినిమాకు చాలా ప్లస్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ వార్ 2 బిజినెస్ లెక్కలు మొదలవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వార్ 2కి భారీ బిజినెస్ డీల్స్ వస్తున్నాయి. రు. 100 – 105 కోట్ల రేంజ్‌లో చర్చలు మొదలయ్యాయట. ఎన్టీఆర్ దేవరకు రు. 120 కోట్ల బిజినెస్ జరిగింది. మరి ఇది డబ్బింగ్ సినిమా.. అందులోనూ ఎన్టీఆర్ పాత్ర చిన్నది కావడంతో కాస్త తక్కువగానే డీల్స్ నడుస్తున్నాయంటున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్‌లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.
ఎన్టీఆర్ వార్ 2 .. ఏపీ + తెలంగాణలో షాకింగ్ బిజినెస్ … !
