Moviesప‌వ‌న్ ' OG ' లో ఇలాంటి ఫైటింగ్ సీన్ కూడానా......

ప‌వ‌న్ ‘ OG ‘ లో ఇలాంటి ఫైటింగ్ సీన్ కూడానా… !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెర‌కెక్కుతోన్న సినిమా ఓజీ.. ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్టార్ ఈ సినిమా క్యాప్ష‌న్‌. ద‌ర్శ‌కుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప‌వ‌న్ చేస్తోన్న అన్ని సినిమాల కంటే ఓజీ మీదే ఎక్కువ హైప్ ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ చేయ‌డానికి ప‌వ‌న్ మ‌ళ్లీ డేట్లు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.ఇక ఓజీ గురించి ఓ క్రేజీ రూమ‌ర్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ పై ఒక షర్ట్ లేకుండా యాక్షన్ సీన్ ఉంటుందట‌. ఈ యాక్ష‌న్ సీన్‌ను స‌రికొత్త‌గా డిజైన్ చేశార‌ని అంటున్నారు. ఓజీ బిజినెస్ డీల్స్ ఏపీ, తెలంగాణ‌లో దుమ్ము రేపేస్తున్నాయి. ఇక ఈ సీన్ విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ త‌న కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎప్పుడో కొన్ని సినిమాలకి మాత్రం షర్ట్ లేకుండా కనిపించాడు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ష‌ర్ట్ లేకుండా సీన్ అంటే ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను అస్స‌లు ఆప‌లేం అని చెప్పాలి.

Latest news