Moviesబాక్సాఫీస్ వ‌ద్ద నాని ఊచ‌కోత‌.. ` హిట్ 3` ఐదు రోజుల...

బాక్సాఫీస్ వ‌ద్ద నాని ఊచ‌కోత‌.. ` హిట్ 3` ఐదు రోజుల క‌లెక్ష‌న్స్ ఇవే!

హిట్ యూనివ‌ర్స్‌లో భాగంగా ఇటీవ‌ల ` హిట్ 3 ` చిత్రం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. శైలేష్ కొల‌ను తెర‌కెక్కిన హిట్: ది థర్డ్ కేస్ లో న్యాచుర‌ల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంట‌గా న‌టించారు. నాని సొంత ప్రొడెక్ష‌న్ వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాని వైల్డ్ యాక్టింగ్, యాక్ష‌న్ సన్నివేశాలు, స్టోరీలోని డెప్త్‌, శైలేష్ మేకింగ్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో నాని క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఊచ‌కోత కోసేస్తున్నారు.వ‌ర్కింగ్ డేస్ లోనూ మంచి హోల్డ్ ను క‌న‌బ‌రుస్తూ హిట్ 3 మూవీ ఐదు రోజుల థియేట్రిక‌ల్ ర‌న్ కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు రోజుల్లో ఏపీ మ‌రియు తెలంగాణ‌లో రూ. 31.04 కోట్ల షేర్‌, రూ. 54.00 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను హిట్ 3 వ‌సూల్ చేసింది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా 5 డేస్ లో రూ. 49.59 కోట్ల షేర్‌, రూ. 93.65 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుంది. హిట్ 3 సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 50 కోట్లు కాగా.. ఐదు రోజుల్లోనే ఆల్మోస్ట్ టార్గెట్ ను నాని రీచ్ అయిపోయాడు. ఇక మ‌రో రూ. 41 ల‌క్ష‌ల షేర్ వ‌చ్చిందంటే హిట్ 3 బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిలిచిన‌ట్లే అవుతుంది.HIT 3 to hit the theaters from May 1: TEASER OUT! - Bigtvlive Englishఏరియాల వారీగా హిట్ 3 మూవీ 5 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ లెక్క‌లు ఇలా ఉన్నాయి..

నిజాం: 13.83 కోట్లు
సీడెడ్: 4.11 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 3.99 కోట్లు
తూర్పు: 2.12 కోట్లు
పశ్చిమ: 1.78 కోట్లు
గుంటూరు: 2.27 కోట్లు
కృష్ణ: 1.97 కోట్లు
నెల్లూరు: 97 లక్షలు
—————————–
ఏపీ+తెలంగాణ‌= 31.04 కోట్లు(54.00 కోట్లు~ గ్రాస్‌)
—————————–

క‌ర్ణాట‌క + రెస్టాఫ్ ఇండియా: 5.80 కోట్లు
ఇతర భాషలు: 1.50 కోట్లు
ఓవ‌ర్సీస్: 11.25 కోట్లు
—————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌= 49.59 కోట్లు(93.65 కోట్లు~ గ్రాస్‌)
—————————–

Latest news