టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న ప్రశ్నలు ఒక్కటే జోరుగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో అట్లీ ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ పాత్రను బాలీవుడ్ హీరోతో చేయిస్తున్నారట. మరి ఆ హీరో ఎవరు ? అన్నది చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ నటించబోతుందని తెలుస్తోంది. ఆమె ఇప్పటికే మరో మెగా హీరో చరణ్ పక్కన వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ సినిమా కథా నేపథ్యం కొనసాగుతుందని అంటున్నారు. అసలు మెయిన్ లైనే చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఓవరాల్‌గా బన్నీ – అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ & ఎమోషనల్ డ్రామా రాబోతుందని అంటున్నారు. సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉంటుంది.
బన్నీ పక్కన చెర్రీ హీరోయిన్… బాలీవుడ్ హీరో…!
