మామూలుగా ఎంత పెద్ద భారీ సినిమాలు అయినా హిందీ సినిమాలు తెలుగులో డైరెక్టుగానే పంపిణీ చేసుకుంటారు. లేదా పంపిణీకి ఇస్తారు. కానీ కానీ మన హీరోలు నటిస్తుండడంతో భారీరేట్లకు విక్రయించుకునే అవకాశం వారికి వస్తోంది. ఆది పురుష్ సినిమా తెలుగు హక్కులు అప్పట్లో రు. 120 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా పరిస్థితి కూడా ఇదే. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. హృతిక్ రోషన్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఒక హీరో.ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫైట్లు.. పాటలు, డ్యాన్సులు ఉన్నాయి. అందుకే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే సినిమా రైట్స్‌కు పోటీ వచ్చేసింది. ఎన్టీఆర్‌తో క్లోజ్‌గా ఉంటూ తమిళ దర్శకుడు నీల్సన్‌తో ఓ ప్రాజెక్టు సెట్ చేసే పనిలో ఉన్న నిర్మాత నాగవంశీ ఇప్పుడు ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారట. ఆయన ఎన్టీఆర్ దేవర రిలీజ్ చేశారు.
ఇక ఆసియన్ అధినేత సునీల్ నారంగ్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తెలుగు రైట్స్ కోసం గట్టి పోటీ ఏర్పడింది. అయితే అంత గిట్టు బాటు అవుతుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పరిమితం… పైగా ఇది డబ్బింగ్ సినిమా.. హృతిక్ రోషన్‌ది మెయిన్ పాత్ర. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు ఎలా ఉన్నా.. మిగిలిన తెలుగు సినీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ? చూడాలి.
‘ వార్ 2 ‘ తెలుగు రైట్స్ @ 120 కోట్లు… తెలుగు రైట్స్ ఎవరి చేతికి అంటే…!
